పుల్వామా ఉగ్రదాడికి మూడేళ్లు.. అమరవీరులకు నివాళులు అర్పించిన మోదీ

PM Modi pays homage to Pulwama attack victims. 2019లో పుల్వామాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన

By Medi Samrat  Published on  14 Feb 2022 7:28 AM GMT
పుల్వామా ఉగ్రదాడికి మూడేళ్లు.. అమరవీరులకు నివాళులు అర్పించిన మోదీ

2019లో పుల్వామాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) సిబ్బందికి ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నివాళులర్పించారు. ఈ సంద‌ర్భంగా వారి ధైర్యసాహసాలను కొనియాడారు. అలాగే వారి ధైర్యసాహసాలు, అత్యున్నత త్యాగం ప్రతి ఒక్క‌ భారతీయుడిని బలమైన భార‌త్ దిశ‌గా పని చేయడానికి ప్రేరేపిస్తుందని ప్ర‌ధాని పేర్కొన్నారు. దక్షిణ కాశ్మీర్ జిల్లాలో పాకిస్థాన్ ప్రేరేపిత‌ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 40 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లు అమ‌రుల‌య్యారు.

2019లో ఈ రోజున పుల్వామాలో అమరులైన వారందరికీ నేను నివాళులర్పిస్తున్నానని.. మన దేశానికి వారు చేసిన విశిష్ట సేవలను గుర్తు చేసుకుంటున్నానని మోదీ ట్వీట్ చేశారు. వారి శౌర్యం, అత్యున్నత త్యాగం ప్రతి భారతీయుడిని బలమైన, సంపన్న దేశం కోసం పని చేయడానికి ప్రేరేపిస్తుందని ట్వీట్ చేశారు. ఇదిలావుంటే.. పుల్వామా దాడికి ప్రతీకార చ‌ర్య‌గా.. భారత వైమానిక దళం ఫిబ్రవరి 26, 2019న పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడి చేసింది.


Next Story