గత నెలలో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించిన మహిళా బాక్సర్లను ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు కలిశారు. ఇటీవల ముగిసిన ఛాంపియన్‌షిప్‌లో భారత్ ఒక స్వర్ణం, రెండు కాంస్య పతకాలు సాధించింది. మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని గెలుచుకుని నిఖత్ జరీన్.. మేరీ కోమ్, సరితా దేవి, జెన్నీ RL, లేఖ KC ల సరసన నిలిచిన సంగతి తెలిసిందే. 57 కేజీల విభాగంలో మనీషా మౌన్, 63 కేజీల విభాగంలో అరంగేట్ర క్రీడాకారిణి పర్వీన్ హుడా కాంస్య పతకాలను గెలుచుకున్నారు.
ఈ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు చివరి బంగారు పతకం 2018లో వచ్చింది. లైట్ ఫ్లై వెయిట్ విభాగంలో (45-48 కిలోలు) మేరీ కోమ్ ఉక్రెయిన్‌కు చెందిన హన్నా ఒఖోటాను ఓడించిన సంగతి తెలిసిందే..! 2006లో నాలుగు స్వర్ణాలు, ఒక రజతం, మూడు కాంస్యాలతో సహా మొత్తం ఎనిమిది పతకాలను భారత్ కైవసం చేసుకుంది. ఈ ఈవెంట్‌లో భారతదేశం అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. మహిళల ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్ 10 స్వర్ణాలు, ఎనిమిది రజతాలు, 21 కాంస్యాలతో సహా 39 పతకాలు సాధించింది.