'ఎయిర్ షో'ను ప్రారంభించిన ప్రధాని మోదీ

PM Modi kick starts India's Air Might show. భారతదేశపు అతిపెద్ద ఏరోస్పేస్, డిఫెన్స్ ఎగ్జిబిషన్ ఏరో ఇండియా 14వ ఎడిషన్‌ను

By Medi Samrat
Published on : 13 Feb 2023 10:38 AM IST

ఎయిర్ షోను ప్రారంభించిన ప్రధాని మోదీ

భారతదేశపు అతిపెద్ద ఏరోస్పేస్, డిఫెన్స్ ఎగ్జిబిషన్ ఏరో ఇండియా 14వ ఎడిషన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. ఐదు రోజుల పాటు జ‌రిగే ఈ ఈవెంట్‌లో ఎయిర్‌క్రాఫ్ట్, వైమానిక ప్రదర్శనలు ఉంటాయి. అలాగే ఏరోస్పేస్, డిఫెన్స్ కంపెనీల కోసం భారీ వాణిజ్య ప్రదర్శన ఉంటుంది. కార్య‌క్ర‌మం ప్రారంభం సందర్భంగా ప్రధాని స్మారక స్టాంపులను కూడా విడుదల చేశారు.

డిఫెన్స్ అధికారుల ప్రకారం.. 110 మంది విదేశీయులతో సహా 809 మంది ప్రదర్శనకారులు ఈ ఈవెంట్‌లో పాల్గొన‌నున్నారు. యెలహంక ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో జరిగిన ప్రదర్శనలో తమ భాగస్వామ్యాన్ని ధృవీకరించారు. ఇది మేక్ ఇన్ ఇండియా ఫర్ ది వరల్డ్‌కు వేదికగా నిలుస్తోందని రక్షణ అధికారులు తెలిపారు. ఏరో ఇండియా ఎగ్జిబిషన్ మొత్తం 35,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఎగ్జిబిషన్ ద్వారా విమానయాన పరిశ్రమ తన ఉత్పత్తులు, సేవలు, సామర్థ్యాలను ప్రదర్శించేందుకు అవకాశం కల్పించ‌నుంది.

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-అభివృద్ధి చేసిన మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ క్లాస్ మానవరహిత వైమానిక వాహనం TAPAS-BH (టాక్టికల్ ఏరియల్ ప్లాట్‌ఫారమ్ ఫర్ అడ్వాన్స్‌డ్ సర్వైలెన్స్ - బియాండ్ హారిజన్) ఏరో ఇండియాలో తన తొలి విమానాన్ని ప్రారంభించింది.

ఏరో ఇండియా 2023 ఈవెంట్‌లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. 'న్యూ ఇండియా' సామర్థ్యానికి బెంగళూరు సాక్షిగా మారింది. దేశం నూత‌న‌ శిఖరాలను తాకుతోంద‌ని అన్నారు. భారతదేశంపై ఇతర దేశాలకు ఉన్న విశ్వాసానికి ఈ ఏరో ఇండియా నిదర్శనం. రక్షణరంగంలో ఆవిష్కరణలను పెంచేందుకు కృషి చేయాలని అన్నారు.


Next Story