క‌రోనా టీకా వేయించుకున్న ప్రధాని మోదీ

PM Modi Kick-starts Covid-19 Vaccination Drive as He Receives 1st Dose. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కరోనా వ్యాక్సిన్‌ వేయించుకున్నారు.

By Medi Samrat  Published on  1 March 2021 4:14 AM GMT
Modi get corona vaccination

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కరోనా వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. సోమవారం ఉదయం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో మొదటి డోసు టీకా వేయించుకున్నానని ప్రధాని ట్వీట్ చేశారు. ఈ సంద‌ర్భంగా.. కోవిడ్-19పై పోరులో మన వైద్యులు, శాస్త్రవేత్తలు చేసిన కృషి చాలా గొప్పదని ఆయన అన్నారు. అర్హులందరూ వ్యాక్సీన్ వేయించుకోవాలని దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అందరం కలిసికట్టుగా భారతదేశాన్ని కోవిడ్-19 రహిత దేశంగా చేద్దామ‌ని అన్నారు.


ఇదిలావుంటే.. దేశంలో రెండో దశ కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం నేటినుండి ప్రారంభమైంది. 60 ఏళ్లకు పైబడిన వారితో పాటు, 45 ఏళ్లకు పైగా వయసు ఉండి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి టీకా ఇవ్వ‌నున్నారు. అంత‌కుముందు మొదటి దశలో, ప్రభుత్వ కేంద్రాలలో మాత్రమే క‌రోనా వ్యాక్సీన్ ఇచ్చారు. కానీ, ఇప్పుడు ఎంపిక చేసిన ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ టీకా అందుబాటులో తెచ్చారు. అయితే.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో టీకా తీసుకోవాల‌నుకుంటే మాత్రం ఒక డోసుకు రూ. 250 చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోలేని వారు.. గుర్తింపు కార్డుతో నేరుగా టీకా కేంద్రానికి వెళ్ళవచ్చు.


Next Story
Share it