బెంగళూరులో కొత్త మెట్రో లైన్‌ను ప్రారంభించిన‌ ప్రధాని మోదీ

PM Modi Inaugurates New Metro Line In Bengaluru. ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటక పర్యటనలో ఉన్నారు. శ్రీ మధుసూదన్ సాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్‌ను

By Medi Samrat  Published on  25 March 2023 9:28 AM GMT
బెంగళూరులో కొత్త మెట్రో లైన్‌ను ప్రారంభించిన‌ ప్రధాని మోదీ

PM Modi Inaugurates New Metro Line In Bengaluru


ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటక పర్యటనలో ఉన్నారు. శ్రీ మధుసూదన్ సాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఆ తర్వాత బెంగళూరులో కొత్త మెట్రో లైన్‌ను కూడా ప్రారంభించారు. బెంగళూరు మెట్రోలోని వైట్‌ఫీల్డ్ (కడుగోడి) నుండి కృష్ణరాజపుర మెట్రో మార్గంలో ప్రయాణించడానికి ప్రధాన మంత్రి మెట్రో టిక్కెట్‌ను కొనుగోలు చేశారు. ప్ర‌యాణిస్తున్న‌ సందర్భంగా ఆయన మెట్రోలో ఉన్న ప్రజలతో ముచ్చటించారు.

అంతకుముందు.. శ్రీ మధుసూదన్ సాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, అందరి కృషితో భారతదేశం అభివృద్ధి చెందుతోందని అన్నారు. అందరి భాగస్వామ్యంతో దేశం పురోగమిస్తోందన్నారు. ప్రజలకు విద్య, వైద్యం అందించడం ద్వారా మానవాళికి సేవ చేయాలనే లక్ష్యంతో చిక్కబళ్లాపూర్‌ ముందుకు వచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. నేడు ఇక్కడ ప్రారంభమవుతున్న ఈ వైద్య కళాశాల మహత్తర మిషన్‌కు మరింత బలం చేకూరుస్తుందన్నారు.

ఆధునిక భారతదేశ వాస్తుశిల్పిలలో ఒకరైన సర్ ఎం. విశ్వేశ్వరయ్య జన్మస్థలం చిక్కబల్లాపూర్ అని ప్రధాని మోదీ అన్నారు. ఇప్పుడే సర్ విశ్వేశ్వరయ్య సమాధి వద్ద పూలమాలలు ఉంచి నివాళులు అర్పించే భాగ్యం కలిగింది. ఈ పుణ్యభూమికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. భారతదేశ ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను పెంచడమే మా ప్రయత్నం అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చాం. దేశంలో చౌక మందుల దుకాణాలు, జన్ ఔషధి కేంద్రాలు ప్రారంభించాం. పేదల ప్రయోజనాల కోసం పనిచేస్తున్న మా ప్రభుత్వం, కన్నడతో సహా అన్ని భారతీయ భాషలలో వైద్య విద్యను అభ్యసించే అవకాశాన్ని ఇచ్చింది. పేదలను కేవలం ఓటు బ్యాంకుగానే పరిగణిస్తున్న రాజకీయాలు చాలా కాలంగా కొనసాగుతున్నాయి. కానీ, పేదలకు సేవ చేయడం తన అత్యున్నత కర్తవ్యంగా బీజేపీ ప్రభుత్వం భావిస్తోందని ప్ర‌ధాని మోదీ అన్నారు.


Next Story