డ్రైవర్ రహిత రైలు ప్రారంభం
PM Modi inaugurates country’s first-ever driverless train. భారతదేశంలో తొలి డ్రైవర్ రహిత రైలును ప్రధాని నరేంద్ర మోడీ
By Medi SamratPublished on : 28 Dec 2020 1:52 PM IST
Next Story
భారతదేశంలో తొలి డ్రైవర్ రహిత రైలును ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఢిల్లీ మెట్రోకు సంబంధించి పశ్చిమ జనక్‌పురి-బొటినికల్ గార్డెన్ మధ్య 37కిలోమీటర్ల పొడవున్న మెజంటా లైన్‌లో ఈ రైలును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ప్రారంభించారు. మొట్టమొదటి డ్రైవర్ రహిత ట్రైన్ సర్వీస్ ను ప్రారంభించిన ఘనతను ఢిల్లీ మెట్రో రైల్వే స్టేషన్ దక్కించుకుంది. మొదటి డ్రైవర్ రహిత మెట్రో రైలు ప్రారంభోత్సవం స్మార్ట్ విధానం వైపు భారతదేశం ఎంత వేగంగా పయనిస్తుందో అందరికీ అర్థమయ్యేలా చెప్తుంది అని ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
డ్రైవర్ లేకుండా నడిచే ట్రైన్లు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 7 శాతం మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఇండియా కూడా ఆ జాబితాలో చేరింది . ఢిల్లీ మెట్రో యొక్క మెజెంటా లైన్‌లో డ్రైవర్‌లేని రైళ్లను ప్రారంభించడంతో ఢిల్లీ మెట్రో యొక్క మరో ప్రధాన కారిడార్ అయిన 37 కిలోమీటర్ల పొడవైన మెజెంటా లైన్ (జనక్‌పురి వెస్ట్ - బొటానికల్ గార్డెన్) లో డ్రైవర్‌లేని సేవలను ప్రారంభించిన తరువాత, 57 కిలోమీటర్ల పొడవైన పింక్ లైన్ (మజ్లిస్ పార్క్ - శివ్ విహార్) లో కూడా డ్రైవర్ రహిత మెట్రో సర్వీసులను 2021 లో ప్రారంభించనున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(డీఎంఆర్‌సీ) తెలిపింది.