ప్రధాని నరేంద్ర మోదీలో నాకు దేవుడి ఆనవాలు కనిపించాయి : సీఎం

PM Modi has traces of God in him says Shivraj Singh Chouhan. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూపర్‌ హ్యూమన్‌ అని, ఆయనలో దేవుడి జాడలు ఉన్నాయని

By Medi Samrat  Published on  2 Feb 2022 12:48 PM IST
ప్రధాని నరేంద్ర మోదీలో నాకు దేవుడి ఆనవాలు కనిపించాయి : సీఎం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూపర్‌ హ్యూమన్‌ అని, ఆయనలో దేవుడి జాడలు ఉన్నాయని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ అన్నారు. ''నరేంద్ర మోదీలో నాకు దేవుడి ఆనవాలు కనిపించాయి.. ఆయన అంతులేని శక్తుల భాండాగారం.. ఒక్క వ్యక్తి ఇంతగా ఎలా పని చేయగలిగాడు.. ఇంతకు ముందు ఏళ్ల తరబడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిపింది. అభివృద్ధి పనులు అసలు జరగలేదు" అని గోవాలోని దబోలిమ్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన బీజేపీ ఎన్నికల ర్యాలీలో చౌహాన్ మాట్లాడారు.

'నేను ముఖ్యమంత్రిని, బీజేపీ కార్యకర్తను అయినందుకు ఈ మాటలు చెప్పడం లేదు. నా మనసులో ఏముందో చెబుతున్నాను. దేశానికి నరేంద్ర మోదీ లాంటి ప్రధాని ఉండటం అదృష్టమని.. ఆయనది అపురూపమైన వ్యక్తిత్వం' అని చౌహాన్ అన్నారు. "నరేంద్ర మోదీ సూపర్ హ్యూమన్. ఆయన గొప్ప ఆలోచనలు ఉన్న మనిషి. ప్రధాని మోదీ విదేశాల్లో భారతదేశం యొక్క గౌరవాన్ని పునరుద్ధరించారు" మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అన్నారు. 'కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు విదేశాల్లో ఉన్నవాళ్లు మనం భారత్‌ నుంచి వచ్చామని చెప్పినా పట్టించుకోలేదు. గౌరవం ఉండేది కాదు. మమ్మల్ని గర్వంగా చూసేవారు కాదు. అవినీతికి సంబంధించిన అంశాలపై భారత్‌పై చర్చ జరిగేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది' అని శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పుకొచ్చారు. గోవా అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉండాలని.. బీజేపీని గెలిపించాలని కోరారు.


Next Story