అమెరికా పర్యటనకు వెళ్లనున్న మోదీ..!

PM Modi expected to travel to US this month. భారత ప్ర‌ధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. గ‌త ఏడాది దేశాధ్య‌క్షుడిగా

By Medi Samrat  Published on  4 Sep 2021 12:41 PM GMT
అమెరికా పర్యటనకు వెళ్లనున్న మోదీ..!

భారత ప్ర‌ధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. గ‌త ఏడాది దేశాధ్య‌క్షుడిగా జో బైడెన్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత‌ ప్రధాని మోదీకి ఇది తొలి ప‌ర్య‌ట‌న కానున్న‌ది. వాషింగ్ట‌న్ డీసీ, న్యూయార్క్‌లో మోదీ ప‌ర్య‌టిస్తారని చెబుతున్నారు. సెప్టెంబ‌ర్ 22 నుంచి 27 మ‌ధ్య ఆ టూర్ ఉంటుంద‌ని భావిస్తున్నారు. అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్‌తో మోదీ ప్ర‌త్యేకంగా భేటీకానున్నారు. ఇద్ద‌రూ ఇప్ప‌టికే మూడు సార్లు వ‌ర్చువ‌ల్‌గా క‌లిశారు. మార్చిలో క్వాడ్ మీటింగ్‌, ఏప్రిల్‌లో వాతావ‌ర‌ణ మార్పులు, జూన్‌లో జ‌రిగిన జీ-7 స‌ద‌స్సులో వాళ్లు క‌లుసుకున్నారు.

జో బైడెన్‌ పరిపాలన పగ్గాలు చేపట్టిన తరువాత అమెరికాలో ప్రధాని మోదీ అమెరికాలో చేస్తున్న మొదటి పర్యటన ఇది. ఈ పర్యటనపై అధికారిక ధృవీకరణ లేకపోయినప్పటికీ.. ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. ప్ర‌ధాని మోదీ 2019 సెప్టెంబ‌ర్‌లో అమెరికా వెళ్లారు. అప్పుడు ఆయ‌న మాజీ అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను క‌లిశారు. హౌడీ మోడీ ఈవెంట్‌లోనూ ఆయ‌న పాల్గొన్నారు. ఆఫ్ఘ‌నిస్తాన్‌లో తాలిబ‌న్ల రాజ్యం ఏర్ప‌డిన నేప‌థ్యంలో.. బైడెన్‌తో మోదీ భేటీ కీల‌కం కానున్న‌ది. బైడెన్ ప్ర‌భుత్వంలోని ఉన్న‌త అధికారుల‌తోనూ మోదీ చ‌ర్చిస్తారు.
Next Story
Share it