కేంద్ర మంత్రి వర్గ విస్తరణ.. అప్డేట్స్
PM Modi Cabinet Reshuffle LIVE Updates. ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రి వర్గాన్ని పునర్వ్యవస్థీకరిస్తున్నారు. ఈ సాయంత్రం జరగనున్న
By Medi Samrat Published on 7 July 2021 9:44 AM GMTప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రి వర్గాన్ని పునర్వ్యవస్థీకరిస్తున్నారు. ఈ సాయంత్రం జరగనున్న కేబినెట్ విస్తరణలో భాగంగా 43 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో ఆహ్వానం అందుకున్న నేతలందరూ ప్రధాని నివాసానికి చేరుకున్నారు. ఇప్పటికే జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ లు కూడా ప్రధాని నివాసానికి చేరుకున్నారు.
అయితే కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్, కార్మిక, ఉపాధి శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ తమ పదవులకు రాజీనామా చేశారు. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి దేవశ్రీ చౌధురి కూడా తన పదవికి రాజీనామా చేశారు. అనారోగ్య కారణాల వల్ల పదవికి రాజీనామా చేసినట్టు పోఖ్రియాల్ తెలిపారు.
మోదీ కేబినెట్ లో 11 మంది మహిళలకు చోటు దక్కనుంది. 27 మంది ఓబీసీలకు చోటు. 19 వెనుకబడిన కులాల నుంచి ప్రాతినిధ్యం. వహించనున్నారు. వీరిలో అయిదు మందికి కేబినెట్ హోదా దక్కనుంది. 12 మంది దళితులకు చోటు దక్కనుండగా.. అందులో ఇద్దరికి కేబినెట్ హోదా దక్కనుంది. ఏడు వేర్వేరు గిరిజన తెగల నుంచి 8 మంది ఎస్టీలకు అవకాశం.. అలాగే ఐదుగురు మైనారిటీలకు మంత్రి పదవి ఇవ్వనున్నారు.
బ్రాహ్మణులు, భూమిహార్, కాయస్థ, క్షత్రియ, లింగాయత్, పటేల్, మరాఠా, రెడ్డి వర్గాలకు చెందిన 29 మందికి మంత్రి పదవులు దక్కనున్నాయి. మంత్రివర్గంలో 14 మంది 50 ఏళ్ల లోపు ఉన్న వారు ఉన్నారు. అందులో ఆరుగురికి కేబినెట్ బెర్త్ దక్కనుంది. కేబినెట్ లో 46 మందికి వివిధ రాష్ట్రాల్లో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది. కొత్త కేబినెట్ లో నలుగురు మాజీ ముఖ్యమంత్రులకు అవకాశం దక్కనుంది.