కర్ణాటక పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ

PM Modi Begins 2-Day Karnataka Visit. ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటకకు చేరుకున్నారు. బెంగళూరులో ఆయనకు

By Medi Samrat  Published on  20 Jun 2022 4:48 PM IST
కర్ణాటక పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటకకు చేరుకున్నారు. బెంగళూరులో ఆయనకు ఘన స్వాగతం పలికారు. బెంగళూరులోని యలహంక ఎయిర్ ఫోర్స్ ఎయిర్ పోర్టులోకి ప్రత్యేక విమానంలో చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి కర్ణాటక గరవ్నర్ థావర్ చంద్ గోహ్లెట్, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ తోపాటు బీజేపీ నాయకులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. 27,000 కోట్ల రూపాయల విలువైన అనేక రైలు, రోడ్డు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం నాడు రెండు రోజుల కర్ణాటక పర్యటనను వెళ్లారు.

రెండో రోజుల పాటు కర్ణాటకలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. యలహంక ఎయిర్ ఫోర్స్ ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరిన ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా ఇండియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్ సీ)కి చేరుకున్నారు. ఐఐఎస్ సీలో రూ. 250 కోట్ల వ్యయంతో నిర్మించిన బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఐఐఎస్ సీ ఆవరణంలో రూ. 425 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బాగ్వి-పార్థసారథి ఆసుపత్రి నిర్మాణానికి శుంకుస్థాపన చేశారు.




Next Story