రైలు ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన ప్రధాని మోదీ

PM Modi arrives at train accident site in Odisha's Balasore. ప్రధాని నరేంద్ర మోదీ రైలు ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించారు. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో మూడు రైళ్లు ఢీకొన్న ఘోర ప్రమాదంలో

By Medi Samrat  Published on  3 Jun 2023 6:24 PM IST
రైలు ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ రైలు ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించారు. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో మూడు రైళ్లు ఢీకొన్న ఘోర ప్రమాదంలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో రైలు ప్రమాదం జరిగిన బాలేశ్వర్ ప్రాంతానికి ప్రధాని చేరుకున్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించి, ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న కేంద్రమంత్రులు అశ్విని వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్, ఇతర అధికారులు ప్రాథమిక నివేదిక వివరాలను ప్రధానికి వివరించారు. ఆ తర్వాత ఆసుపత్రికి చేరుకొని, అక్కడి క్షతగాత్రులను పరామర్శించారు. ఎయిర్ ఫోర్స్ చాపర్ ద్వారా బాలాసోర్ లో ప్రధాని మోదీ దిగారు.

ఒడిషాలోని బాలాసోర్‌లో చోటుచేసుకున్న రైలు ప్రమాదం దేశ వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. మూడు రైళ్లు ఢీ కొన్న ఈ ఘటనలో 290 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. రైళ్లు అతివేగంతో ప్రయాణిస్తూ ఒకదాన్ని మరొకటి ఢీకొట్టడంతో.. కొన్ని బోగీలు గాల్లోకి లేచి, తిరిగిపోయాయి. అంతేబలంగా కిందికి పడిపోవడంతో ప్రయాణికులు వాటికింద నలిగిపోయారు.


Next Story