కేంద్రం గుడ్‌న్యూస్.. రైపే రైతుల అకౌంట్లోకి డబ్బులు
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 16వ విడత డబ్బులపై కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది.
By అంజి Published on 27 Feb 2024 6:14 AM ISTకేంద్రం గుడ్‌న్యూస్.. రైపే రైతుల అకౌంట్లోకి డబ్బులు
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 16వ విడత డబ్బులపై కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. ఈ నెల 28వ తేదీ నాడు రైతుల అకౌంట్లలో రూ.2 వేల చొప్పున జమ చేయనున్నట్టు తెలిపింది. ప్రధాని మోదీ బటన్ నొక్కి ఈ నిధులను విడుదల చేస్తారని పేర్కొంది. . మహారాష్ట్రలోని యావత్మాల్ నుంచి మోదీ ఈ నిధులు విడుదల చేయనున్నారు. ఈ మేరకు పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ సహా పీఎం కిసాన్ అధికారిక ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్లోనూ వెల్లడించారు. ఈ డబ్బులు రావాలంటే రైతులు తప్పనిసరిగా ఈ కేవైసీ నమోదు చేసుకోవాలని స్పష్టం చేసింది.
OTP ఆధారిత eKYC పీఎం కిసాన్ పోర్టల్‌లో అందుబాటులో ఉంది. పీఎం కిసాన్ అనేది రైతులకు మూడు సమాన వాయిదాలలో సంవత్సరానికి రూ.6000 ఆదాయ మద్దతునిచ్చే కేంద్ర పథకం. నిధులు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాకు జమ చేస్తారు. సాగు భూమి ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకం అందుబాటులో ఉంటుంది. పన్ను చెల్లింపుదారులు ఈ పథకం కింద అర్హులు కాదు. 16వ విడత విడుదల కోసం, రైతులు తప్పనిసరిగా eKYCని పూర్తి చేసి, వారి బ్యాంకు ఖాతాలతో వారి ఆధార్‌ను లింక్ చేయాలి. ఇది మధ్యవర్తులను తొలగిస్తూ నిజమైన లబ్ధిదారులకు ప్రయోజనాలను నేరుగా బదిలీ చేస్తుంది.