రైతులకు గుడ్‌న్యూస్‌.. ఖాతాల్లో డబ్బులు జమ

రైతులకు పెట్టుబడి సాయం కింద 15వ విడత ధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధులు రూ.18 వేల కోట్లను ప్రధాని మోదీ విడుదల చేశారు.

By అంజి  Published on  15 Nov 2023 1:04 PM IST
PM Kisan, beneficiaries, PM Modi, Central Govt, National news

రైతులకు గుడ్‌న్యూస్‌.. ఖాతాల్లో డబ్బులు జమ

లక్షలాది మంది రైతులకు ప్రధాని నరేంద్ర మోదీ శుభవార్త చెప్పారు. రైతులకు పెట్టుబడి సాయం కింద 15వ విడత ధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధులు రూ.18 వేల కోట్లను ప్రధాని మోదీ విడుదల చేశారు. జార్ఖండ్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన దాదాపు 8 కోట్ల మంది అర్హుల ఖాతాల్లో రూ.2 వేల చొప్పున జమ చేశారు. ఏటా మూడు విడతలుగా కేంద్రం రూ.6 వేలు రైతులకు అందిస్తోన్న సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో నవంబరు 17న పోలింగ్ ఉంది. దీనికి సరిగ్గా రెండు రోజుల ముందు పీఎం కిసాన్ నిధులను విడుదల చేయడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉద్దేశపూర్వకంగానే ప్రధాని మోదీ ఇలా చేస్తున్నారని ఆరోపించింది.

ఏదిఏమైనప్పటికీ ఈ-కేవైసీ పూర్తి చేసుకున్న రైతులందరి ఖాతాల్లో ఈరోజు రూ.2వేలు చొప్పున జమవుతాయి. కాగా పీఎం కిసాన్‌ పథకం ద్వారా ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి 14 వాయిదాలలో 2.62 లక్షల కోట్ల రూపాయలకు పైగా కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసింది. ఈ ఏడాది జూలై నాటికి మధ్యప్రదేశ్‌ నుంచి 83,70,263 మంది లబ్ధిదారులు, రాజస్థాన్‌ నుంచి 63,98,381 మంది రైతులు, ఛత్తీస్‌గఢ్‌ నుంచి 21,70,541 మంది, తెలంగాణ నుంచి 31,15,499 మంది లబ్ధిదారులు, 92,520 మంది వ్యక్తులు లబ్ధిదారులను నమోదు చేసుకున్నట్లు కేంద్రం నివేదించింది.

Next Story