Phase 6 Polling : నేడు 6వ దశ లోక్‌స‌భ ఎన్నిక‌ల‌ పోలింగ్.. పోటీలో ఉన్న ప్ర‌ముఖులు వీరే..

ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలు, బెంగాల్‌లోని జంగల్ మహల్ ప్రాంతంతో సహా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 నియోజకవర్గాల్లో లోక్‌సభ ఎన్నికల ఆరవ దశకు శనివారం ఓటింగ్ జరగనుంది

By Medi Samrat  Published on  25 May 2024 7:03 AM IST
Phase 6 Polling : నేడు 6వ దశ లోక్‌స‌భ ఎన్నిక‌ల‌ పోలింగ్.. పోటీలో ఉన్న ప్ర‌ముఖులు వీరే..

ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలు, బెంగాల్‌లోని జంగల్ మహల్ ప్రాంతంతో సహా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 నియోజకవర్గాల్లో లోక్‌సభ ఎన్నికల ఆరవ దశకు శనివారం ఓటింగ్ జరగనుంది. దేశ రాజధానితో పాటు ఉత్తరప్రదేశ్‌లోని 14 స్థానాలు, హర్యానాలోని మొత్తం 10 స్థానాలు, బీహార్, పశ్చిమ బెంగాల్‌లో ఎనిమిదేసి స్థానాలు, ఒడిశాలో ఆరు స్థానాలు, జార్ఖండ్‌లో నాలుగు స్థానాలు, జమ్మూ కాశ్మీర్‌లోని ఒక స్థానానికి శనివారం పోలింగ్ జరగనుంది. నేడు ఒడిశాలోని 42 అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఏకకాలంలో పోలింగ్ జరగనుంది.

11.13 కోట్ల మంది ఓటర్లు నేడు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. 5.84 కోట్ల మంది పురుషులు, 5.29 కోట్ల మంది మహిళలు, 5,120 మంది థర్డ్ జెండర్ ఓట‌ర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ఎన్నికల సంఘం (ఈసీ) 1.14 లక్షల పోలింగ్ కేంద్రాల వద్ద దాదాపు 11.4 లక్షల మంది పోలింగ్ అధికారులను మోహరించింది.

భారతదేశంలోని చాలా ప్రాంతాలు ఎండ వేడితో కొట్టుమిట్టాడుతున్నందున ఎన్నికల అధికారులు ప్ర‌జ‌ల కోసం ప్ర‌త్యేక ఏర్పాట్లు చేశారు. ఆర‌వ ద‌శ‌లో కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, ఇంద్రజిత్ సింగ్, క్రిషన్ పాల్ గుర్జార్, బీజేపీకి చెందిన మేనకా గాంధీ, సంబిత్ పాత్ర, మనోహర్ లాల్ ఖట్టర్, మనోజ్ తివారీ, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, దీపేందర్ సింగ్ హుడా, రాజ్ బబ్బర్, కన్హయ్య కుమార్ వంటి ప్ర‌ముఖులు ఎన్నిక‌ల బ‌రిలో ఉన్నారు.

Next Story