సొరంగాన్ని కనుగొన్న భారత సైన్యం
Pak’s secret tunnel to push terrorists for 8 years in Jammu detected by BSF. భారత సైన్యం మరో సొరంగాన్ని కనుగొంది.
By Medi Samrat Published on 23 Jan 2021 5:38 PM ISTభారత సైన్యం మరో సొరంగాన్ని కనుగొంది. పాకిస్థాన్ భారత్ లోకి తీవ్రవాదులను పంపించడానికి ఈ సొరంగాన్ని వాడుతూ ఉంది. భారత్‌లోకి ఉగ్రవాదులను పంపేందుకు జమ్ము కశ్మీర్‌లో పాకిస్తాన్ ఐఎస్‌ఐ ఉపయోగించిన 150 మీటర్ల పొడవైన భారీ రహస్య సొరంగాన్ని వాడిందని బీఎస్‌ఎఫ్ చెబుతోంది. కతువా జిల్లాలోని పన్సార్ వద్ద ఒక సీక్రెట్ సొరంగాన్ని బీఎస్‌ఎఫ్ దళాలు గుర్తించాయి. బీఎస్‌ఎప్ ఔట్‌పోస్ట్ సమీపంలో బోర్డర్ పోస్ట్ వద్ద 30 అడుగుల లోతైన రహస్య టన్నెల్‌ను గుర్తించామని బీఎస్‌ఎఫ్ అధికారులు శనివారం ప్రకటించారు. పాకిస్తాన్ మిలిటరీ, దాని ఉగ్రవాదుల సొరంగాలను గుర్తించడం చాలా ముఖ్యమనీ అక్రమ చొరబాట్లకు ఉగ్రవాదులు ఈ సొరంగాలను ఉపయోగిస్తారని భారత్ చెబుతోంది. గత పదిరోజుల్లో రెండు భారీ సొరంగాలను బీఎస్‌ఎఫ్ గుర్తించింది.
గత ఏడాదిగా బీఎస్‌ఎఫ్ పలు సొరంగాలను పసిగట్టి ధ్వంసం చేస్తూ వస్తోంది. తీవ్రవాదులను పంపించడానికి పాక్ ఈ ప్రయత్నాలను చేస్తూనే ఉంది. కతువా జిల్లాలోని పన్సార్ వద్ద ఉన్న సీక్రెట్ సొరంగాన్ని ద్వారా గత ఎనిమిదేళ్ల నుంచి భారత్‌లోకి పాకిస్తాన్ ఉగ్రవాదులను దేశంలోకి పంపిస్తోంది. నియంత్రణ రేఖను దాటడం చాలా కష్టమైనప్పుడు, పాక్ ఉగ్రవాదులు దేశంలోకి చొరబడేందుకు ఎంచుకుంటారని తెలిపారు. 2012 నుంచి పాకిస్తాన్ భారత శిబిరాలపై కాల్పులకు తెగ బడుతోందని, ఈ ప్రాంతానికి సమీపంలోనే కొత్త బంకర్‌ను గుర్తించినట్టు బీఎస్‌ఎఫ్ వర్గాలు తెలిపాయి. పాకిస్థాన్ భారత్ మీదకు తీవ్రవాదులను పంపుతూ ఉంది.. అందుకు సంబంధించిన కుట్రలను ఎప్పటికప్పుడు భారత్ తిప్పికొడుతూ ఉంది.