నోటీసులు అందుకున్న సీమా హైదర్

గత ఏడాది తన ప్రేమికుడితో కలిసి అక్రమంగా భారత్‌కు చేరుకున్న పాకిస్థాన్ మహిళ సీమా హైదర్‌కు నోయిడాలోని ఫ్యామిలీ కోర్టు సమన్లు ​​జారీ చేసింది

By Medi Samrat  Published on  16 April 2024 5:15 PM IST
నోటీసులు అందుకున్న సీమా హైదర్

గత ఏడాది తన ప్రేమికుడితో కలిసి అక్రమంగా భారత్‌కు చేరుకున్న పాకిస్థాన్ మహిళ సీమా హైదర్‌కు నోయిడాలోని ఫ్యామిలీ కోర్టు సమన్లు ​​జారీ చేసింది. సీమా హైదర్ గత ఏడాది మేలో తన నలుగురు మైనర్ పిల్లలతో కలిసి భారత్‌లోకి వచ్చింది. అప్పటికే ఆమె పాక్ కు చెందిన గులాం హైదర్‌ను వివాహం చేసుకుంది. సీమా భారతదేశంలో సచిన్ మీనాతో కలిసి ఉంది. PUBG గేమ్ ఆడుతున్నప్పుడు కలుసుకున్నారు. ఖాట్మండులో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారని చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు.

కరాచీలో నివసిస్తున్న గులాం హైదర్.. సచిన్ మీనాతో సీమా పెళ్లి చెల్లుబాటును సవాలు చేస్తూ భారతీయ న్యాయవాది ద్వారా నోయిడాలోని కుటుంబ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాకుండా గులాం హైదర్ తన పిల్లల మత మార్పిడిని కూడా సవాలు చేశాడు. గులాం హైదర్ నుంచి సీమా విడాకులు తీసుకోలేదని.. సచిన్‌తో ఆమె వివాహం చెల్లదని గులాం హైదర్ తరఫు న్యాయవాది మోమిన్ మాలిక్ వాదించారు. మే 27న కోర్టుకు హాజరుకావాలని కోరింది. సీమా హైదర్ మొదటి భర్త సౌదీ అరేబియాలో పనిచేస్తున్నప్పుడు ఆమె యూఏఈ, నేపాల్ మీదుగా భారత్‌కు వచ్చింది.

Next Story