పహల్గామ్ దాడికి కొన్ని రోజుల ముందు పాకిస్తాన్‌లో జరిగిన రెండు వేర్వేరు కార్యక్రమాలలో రెండు ప్రసంగాలు జరిగాయి. అవి పహల్గామ్ లో జరిగిన మారణహోమంలో పాకిస్తాన్ సంబంధాన్ని బహిర్గతం చేశాయి. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఏప్రిల్ 16న మాట్లాడుతూ.. పాకిస్తాన్ ఏర్పాటుకు దారితీసిన రెండు దేశాల సిద్ధాంతాన్ని చెప్పాడు. హిందువులు, ముస్లింల మధ్య స్పష్టమైన తేడాలను హైలైట్ చేసాడు.
మరొక ప్రసంగం ఏప్రిల్ 18న POKలోని రావల్‌కోట్‌లో జరిగిన ర్యాలీ నుండి వచ్చింది. కశ్మీర్‌లో జిహాద్, రక్తపాతం కోసం LeT కమాండర్ అబూ ముసా పిలుపునిచ్చారు. ఈ ర్యాలీకి అనేక మంది ఉగ్రవాద నాయకులు హాజరయ్యారు. భారత దళాలు హతమార్చిన ఇద్దరు LeT ఉగ్రవాదుల జ్ఞాపకార్థం ఈ ర్యాలీ జరిగింది. భారత నిఘా సంస్థలు ధృవీకరించిన వైరల్ వీడియోలో, ఆర్టికల్ 370 రద్దుకు ప్రతీకారంగా.. కశ్మీర్‌లో ఉగ్రవాద దాడులకు ముసా పిలుపునిచ్చాడు. పహల్గామ్ లో దాడి చేసే ముందు టూరిస్టుల పేర్లు, మతం అడిగి మరీ దాడులు చేశారు.