జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రదాడి.. 27 మంది మృతి

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేశారు.

By Medi Samrat
Published on : 22 April 2025 9:23 PM IST

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రదాడి.. 27 మంది మృతి

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఇందులో 27 మంది పర్యాటకులు మరణించారు. 20 మంది గాయపడ్డారు. లష్కరే తోయిబాకు చెందిన హిట్ స్క్వాడ్ రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్) ఈ దాడికి బాధ్యత వహించింది. ఉగ్రవాదుల దాడి తర్వాత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అమిత్ షాతో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ క్రూరమైన ఉగ్రదాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టబోమని, నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని, కఠినంగా శిక్షిస్తామని అమిత్ షా అన్నారు. హోంమంత్రి అమిత్ షా కొద్దిసేపటికే శ్రీనగర్ చేరుకున్నారు. ఇక్కడ హోంమంత్రి అన్ని ఏజెన్సీలతో భద్రతా సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా శ్రీనగర్ చేరుకున్నారు. సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా విమానాశ్రయంలో ఉన్నారు.

పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడికి వ్యతిరేకంగా శ్రీనగర్‌లోని స్థానిక ప్రజలు కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు. ఈ దాడిని ఖండిస్తున్నామని మక్కా మార్కెట్ జనరల్ సెక్రటరీ ఫయాజ్ అహ్మద్ భట్ తెలిపారు.

Next Story