జమ్మూ కాశ్మీర్ లో మరో ఎన్ కౌంటర్

Officials say Terrorist hideout busted in Jammu and Kashmir's Poonch. జమ్మూ కాశ్మీర్‌లోని దక్షిణ కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలోని జైన్ పోరా గ్రామంలోని షిర్మల్ ప్రాంతంలో

By Medi Samrat  Published on  9 May 2022 3:58 PM IST
జమ్మూ కాశ్మీర్ లో మరో ఎన్ కౌంటర్

జమ్మూ కాశ్మీర్‌లోని దక్షిణ కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలోని జైన్ పోరా గ్రామంలోని షిర్మల్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఆదివారం తెల్లవారుజామున కుల్గామ్ జిల్లాలో లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)కి చెందిన పాకిస్తానీ ఉగ్రవాది, స్థానిక ఉగ్రవాది హతమయ్యారు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాకిస్థాన్ ఉగ్రవాది ఉత్తర కాశ్మీర్‌లో రెండేళ్లకు పైగా యాక్టివ్ గా ఉన్నాడు. వివిధ ఉగ్రవాద నేరాలలో కూడా పాల్గొన్నాడు. స్థానిక ఉగ్రవాది ఏప్రిల్ 13న కుల్గామ్‌లోని కక్రాన్‌లో మైనారిటీ వర్గానికి చెందిన సతీష్ కుమార్ సింగ్ అనే పౌరుడిని హత్య చేయడంలో పాల్గొన్నాడు. ఉగ్రవాదుల ఉనికి సమాచారంతో చెయాన్‌ దేవ్‌సర్‌ ప్రాంతంలో భద్రతా బలగాలు సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో బలగాలపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని.. వారిలో ఒకరు పాకిస్థాన్ ఉగ్రవాది హైదర్‌గా గుర్తించినట్లు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ) విజయ్ కుమార్ తెలిపారు.

అంతకు ముందు అనంతనాగ్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. అమర్‌నాథ్ యాత్ర మార్గం పహల్గావ్ అటవీ ప్రాంతంలో ముష్కర మూకలు, సైన్యాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. గురువారం రాత్రి ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు నిర్భంద తనిఖీలు నిర్వహించాయి. ఈ సమయంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన సైన్యం ఎదురుకాల్పులు ప్రారంభించింది. ఈ కాల్పుల్లో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థకు ముగ్గురు తీవ్రవాదులు హతమయ్యారు. వీరిలో హిజ్బుల్‌లో చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్న తీవ్రవాది అశ్రఫ్ మోల్పీ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అమర్నాథ్ యాత్ర మార్గంలో జరిగిన ఎన్కౌంటర్ తమకు అతిపెద్ద విజయం అని కశ్మీర్ జోన్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు.














Next Story