48 గంటల పాటూ ఇంటర్నెట్ బంద్
సోషల్ మీడియా పోస్టింగ్ లు కాస్తా మత ఘర్షణలకు దారి తీశాయి. అవి కాస్తా హింసాత్మకంగా మారాయి.
By Medi Samrat Published on 28 Sep 2024 4:15 AM GMTసోషల్ మీడియా పోస్టింగ్ లు కాస్తా మత ఘర్షణలకు దారి తీశాయి. అవి కాస్తా హింసాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం భద్రక్ జిల్లాలో సెప్టెంబర్ 30 వరకు 48 గంటల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది.
మత విశ్వాసాలకు సంబంధించిన ఫేస్‌బుక్ పోస్ట్‌పై ఒక సంఘం చేసిన నిరసన హింసాత్మకంగా మారాయి. ఈ గొడవల్లో పోలీసు సిబ్బందికి కూడా గాయలయ్యాయి. ఈ పరిణామాల అనంతరం భద్రక్ పట్టణంలో బహిరంగ సభలను నిషేధిస్తూ అధికారులు ఆజ్ఞలు అమలు చేశారు. శుక్రవారం రాత్రికి భద్రక్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు, రాళ్లదాడి ఘటనలో కొందరు అధికారులు గాయపడటంతో అదనపు పోలీసులను మోహరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పోస్ట్‌కు కారణమైన వ్యక్తిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ 600 మందికి పైగా నిరసనకారులు కచేరీబజార్, పురునాబజార్‌లను కలిపే శాంథియా వంతెనపై నిరసనలకు దిగారు. ర్యాలీని అడ్డుకోడానికి పోలీసులు ప్రయత్నించారు. ఆ సమయంలో లాఠీచార్జి జరిగింది. దీనికి ప్రతిగా కొందరు ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వడం ప్రారంభించారు. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP), సబ్-ఇన్‌స్పెక్టర్ గాయపడ్డారు. భద్రక్ తహసీల్దార్ వాహనం భారీగా ధ్వంసమైంది.
సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ మోనాజ్ పాత్ర జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం భద్రక్‌లో గతంలో కూడా మతపరమైన మతపరమైన హింస చెలరేగింది. ఏప్రిల్ 2017లో ఓ Facebook పోస్ట్‌ను అనుసరించి పట్టణంలో హింసాత్మక ఘర్షణలు జరిగాయి. దీని ఫలితంగా భారీగా ఆస్తుల ధ్వంసం జరిగింది. ₹9 కోట్ల విలువైన ఆస్తి నష్టం జరిగింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నెల రోజుల పాటు కర్ఫ్యూ విధించారు.