Video : ఇద్దరు కుమారుల మృతదేహాలను భుజాలపై మోసుకెళ్లిన దంపతులు
మహారాష్ట్రలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అహేరి తాలూకాకు చెందిన ఒక జంట తమ ఇద్దరు కుమారుల మృతదేహాలను భుజాలపై మోసుకుని తీసుకువెళ్లవలసి వచ్చింది
By Medi Samrat Published on 5 Sep 2024 1:22 PM GMTమహారాష్ట్రలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అహేరి తాలూకాకు చెందిన ఒక జంట తమ ఇద్దరు కుమారుల మృతదేహాలను భుజాలపై మోసుకుని తీసుకువెళ్లవలసి వచ్చింది. సకాలంలో సరైన వైద్యం అందించకపోవడంతో ఆ పిల్లలు జ్వరంతో మరణించారు. ఆ మృతదేహాలను ఆసుపత్రి నుండి 15 కి.మీ దూరంలోని గడ్చిరోలిలోని వారి గ్రామానికి తీసుకుని వెళ్లడానికి అంబులెన్స్ సదుపాయం లేకపోవడంతో భుజాలపై మోసుకుని వెళ్ళింది ఆ జంట.
10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఇద్దరు మైనర్ బాలుర మృతదేహాలను వారి భుజాలపై వేసుకుని, బురదతో కూడిన అటవీ మార్గం గుండా వెళుతున్న ఆ జంట వీడియోను అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు విజయ్ వాడెట్టివార్ పంచుకున్నారు. “ఇద్దరు తోబుట్టువులు జ్వరంతో బాధపడుతున్నారు, కానీ వారికి సకాలంలో చికిత్స లభించలేదు. రెండు గంటల వ్యవధిలో, వారి పరిస్థితి క్షీణించింది. తరువాతి ఒక గంటలో, ఇద్దరు అబ్బాయిలు చనిపోయారు,”అని వాడెట్టివార్ విషాదానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. ఇద్దరు మైనర్‌ల మృతదేహాలను వారి గ్రామానికి తరలించడానికి కూడా అంబులెన్స్ లేదు. తల్లిదండ్రులు వర్షంలో బురద మార్గం గుండా 15 కిలోమీటర్లు నడవవలసి వచ్చిందన్నారు. గడ్చిరోలి ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు సంబంధించిన భయంకరమైన వాస్తవం ఈ రోజు మళ్లీ తెరపైకి వచ్చిందన్నారు విజయ్.
दोन्ही लेकरांचे ‘मृतदेह’ खांद्यावर घेऊन चिखलातून वाट शोधत पुढे जात असलेले हे दाम्पत्य गडचिरोली जिल्ह्यातील अहेरी तालुक्यातील आहे.
— Vijay Wadettiwar (@VijayWadettiwar) September 5, 2024
आजोळी आलेल्या दोन भावंडांना ताप आला. वेळेत उपचार मिळाले नाही. दोन तासांतच दोघांचीही प्रकृती खालावली व दीड तासांच्या अंतराने दोघांनीही अखेरचा श्वास… pic.twitter.com/ekQBQHXeGu