రేపు సుప్రీంకోర్టు కొత్త‌ న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం

Nine New Judges Take Charge Supreme Court Judges. ఇటీవల సుప్రీంకోర్టుకు కొత్తగా 9 మంది న్యాయమూర్తులను నియమిస్తూ.. రాష్ట్రపతి

By Medi Samrat  Published on  30 Aug 2021 9:19 PM IST
రేపు సుప్రీంకోర్టు కొత్త‌ న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం

ఇటీవల సుప్రీంకోర్టుకు కొత్తగా 9 మంది న్యాయమూర్తులను నియమిస్తూ.. రాష్ట్రపతి ఆమోదంతో కేంద్రం గెజిట్‌ విడుదల చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో కొత్తగా నియమితులైన తొమ్మిది మంది న్యాయమూర్తులు మంగళవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 10.30 గంటలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ కొత్త జడ్జీలతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

ఒకేసారి తొమ్మిది మంది న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేయడం చరిత్రలో ఇదే తొలిసారి కాగా.. జడ్జిల ప్రమాణస్వీకారం కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడం ఇదే మొదటిసారి. ఇక 9 మంది నియామకంతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరనుంది. జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ బీవీ నాగరత్నం, జస్టిస్‌ బేలా త్రివేది, జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ రవికుమార్‌, జస్టిస్ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ సుందరేష్, జస్టిస్‌ ఏఎస్‌ ఒకా, జస్టిస్‌ విక్రమ్‌నాథ్ లు రేపు ప్రమాణస్వీకారం చేయ‌నున్నారు.



Next Story