ప్రధాని మోదీని కలిసిన ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌ను ప్రకటించింది
By Medi Samrat
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌ను ప్రకటించింది. ఈ విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆదివారం వెల్లడించారు. మరుసటి రోజు అంటే సోమవారం సీపీ రాధాకృష్ణన్ న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఉపరాష్ట్రపతి పదవికి సెప్టెంబరు 9న ఓటింగ్ జరగనుంది. సీపీ రాధాకృష్ణన్ ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్నారు. సోమవారం ఆయన ప్రధాని నివాసంలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు.
PM Modi కూడా X లో పోస్ట్‌ను షేర్ చేశారు. NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థి అయినందుకు ఆయనకు మా శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన సుదీర్ఘ ప్రజా సేవ, వివిధ రంగాలలో అనుభవం మన దేశాన్ని సుసంపన్నం చేస్తుంది. ఆయన ఎప్పుడూ చూపిన అదే అంకితభావం, దృఢ సంకల్పంతో దేశానికి సేవ చేస్తూనే ఉంటారని పేర్కొన్నారు.
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌ను ఎంపిక చేసింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదివారం ప్రకటించారు. సీపీ రాధాకృష్ణన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందనలు తెలిపారు.
ఉపరాష్ట్రపతి పదవికి ఇండియా కూటమి ఇంకా తన అభ్యర్థిని నిలబెట్టలేదు. అయితే ప్రతిపక్షాలతో మాట్లాడతామని కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు. మేము వారి మద్దతును పొందాలి, తద్వారా ఈ పదవికి ఎన్నికలు ఏకపక్షంగా నిర్వహించబడతాయన్నారు.