జైలు నుంచి విడుద‌లైన సిద్ధూ

Navjot Singh Sidhu Released From Patiala Central Jail After 10 Months. పాటియాలా సెంట్రల్ జైలులో నుండి పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ విడుదలయ్యారు.

By Medi Samrat  Published on  1 April 2023 7:44 PM IST
జైలు నుంచి విడుద‌లైన సిద్ధూ

Navjot Singh Sidhu Released From Patiala Central Jail After 10 Months


పాటియాలా సెంట్రల్ జైలులో నుండి పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ విడుదలయ్యారు. పది నెలల జైలు జీవితం గడిపిన తర్వాత ఈరోజు విడుదలయ్యారు. నీలిరంగు కుర్తా, తలపాగా ధరించి, చేతిలో పుస్తకంతో జైలు నుండి బయటకు వచ్చాడు సిద్ధూ. 59 ఏళ్ల మాజీ క్రికెటర్ విడుదలైన తర్వాత ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు పలువురు కాంగ్రెస్ నాయకులు, మద్దతుదారులు పాటియాలా జైలు వెలుపల గుమిగూడారు. 'నవజోత్ సిద్ధూ జిందాబాద్' అనే నినాదాలు ఆ ప్రాంతంలో మిన్నంటాయి. నవజ్యోత్ సిద్ధూకు ఘన స్వాగతం పలికేందుకు ఆయన అభిమానులు, మద్దతుదారులు జైలు వెలుపల భారీగా వేచి ఉన్నారు. పాటియాలా నగరంలోని పలు చోట్ల నవజ్యోత్ సిద్ధూకు స్వాగతం పలికేందుకు సిద్ధూ మద్దతుదారులు పోస్టర్లు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు.

డిసెంబరు 27, 1988న పాటియాలా నివాసి 65 ఏళ్ల గుర్నామ్ సింగ్‌తో పార్కింగ్ స్థలం విషయంలో నవజ్యోత్ సిద్ధూ గొడవపడ్డారు. నవజ్యోత్ సిద్ధూ, అతని స్నేహితుడు రూపిందర్ సింగ్ సంధు గుర్నామ్ సింగ్‌ను అతని కారు నుండి బయటకు లాగి కొట్టారు. అనంతరం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సిద్ధూ గుర్నామ్‌సింగ్‌ తలపై గట్టిగా కొట్టడంతో మరణించారనే కొందరు సాక్ష్యం చెప్పడంతో జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. సత్ప్రవర్తన కారణంగా రెండు నెలల ముందే సిద్ధూ జైలు నుండి విడుదలయ్యారు.


Next Story