మహారాష్ట్రలో ఆకాశం నుండి భూమి మీదకు పడ్డ వస్తువు.. ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టిన ఇస్రో..

Mysterious objects ‘fall from sky’ in Chandrapur. మహారాష్ట్రలో ఆకాశం నుండి భూమి మీదకు పడ్డ వస్తువు గురించి తీవ్ర చర్చ కొనసాగుతూ ఉంది.

By Medi Samrat  Published on  9 April 2022 4:15 PM IST
మహారాష్ట్రలో ఆకాశం నుండి భూమి మీదకు పడ్డ వస్తువు.. ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టిన ఇస్రో..

మహారాష్ట్రలో ఆకాశం నుండి భూమి మీదకు పడ్డ వస్తువు గురించి తీవ్ర చర్చ కొనసాగుతూ ఉంది. మహారాష్ట్రలో UFO(గ్రహాంతర వాసులు ప్రయాణించే వాహనం) కనిపించిందని స్థానికులు చెబుతున్నారు. రాష్ట్రంలోని చంద్రపూర్ జిల్లాలో కొన్ని రహస్యమైన, గుర్తుతెలియని వస్తువులు ఆకాశం నుండి పడిపోవడంతో స్థానికులు ఆందోళన చెందుతూ ఉన్నారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తల బృందం మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాను సందర్శించనుంది. ఆ వస్తువులు ఒక విధమైన బూస్టర్ రాకెట్ కు సంబంధించిన భాగాలని అంటున్నారు. గుర్తు తెలియని వస్తువు గత వారం రాత్రిపూట ఆకాశంలో వ్యాపించింది.

చంద్రాపూర్ జిల్లా కలెక్టర్ అజయ్ గుల్హానే మాట్లాడుతూ, లాడ్‌బోరి గ్రామంలోని బహిరంగ ప్లాట్‌లో పడి ఉన్న ఇనుప వస్తువును గుర్తించిన స్థానికులు ఉలిక్కిపడ్డారు. గుల్హనే మాట్లాడుతూ, "ఇది 1 నుండి 1.5 అడుగుల వ్యాసం కలిగిన సిలిండర్ లాంటిది. దీన్ని పరీక్షించడం కోసం సేకరించాము. మరిన్ని వస్తువుల భాగాలు, ఎక్కడైనా చెల్లాచెదురుగా పడి ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి మేము జిల్లాలోని ప్రతి గ్రామానికి జూనియర్ రెవెన్యూ అధికారులను పంపాము." అని అన్నారు.

పవన్‌పూర్ గ్రామంలో స్థూపాకార వస్తువును స్థానికులు గుర్తించడంతో ఈ సంఘటన పలువురిని ఆకర్షించింది. ఆ తర్వాత ఈ ప్రాంతంలో మరో ఐదు సిలిండర్లు కనుగొనబడ్డాయి. ఇదే సమయంలో ఇస్రో రంగంలోకి దిగింది. ఈ సమస్యను పరిశీలించేందుకు అంతరిక్ష సంస్థ తన వ్యోమగాముల్లో కొంతమందిని మహారాష్ట్రకు పంపింది. ఫేస్‌బుక్ పోస్ట్‌లో, ఇస్రో "జిల్లా పరిపాలన అభ్యర్థించినట్లు, ఇస్రో నుండి శాస్త్రవేత్తల బృందం తనిఖీల కోసం, తదుపరి శాస్త్రీయ విచారణ కోసం పవన్‌పూర్‌ను సందర్శిస్తుంది." అని తెలిపింది. అంతుచిక్కని వస్తువుల మూలాన్ని ఇంకా గుర్తించనప్పటికీ, రాకెట్ లేదా ఉపగ్రహం మళ్లీ ప్రవేశించడం వల్ల ఇది జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. చాలా మంది స్థానికులు కూడా ఈ ప్రాంతం మీదుగా UFO ప్రయాణించి ఉంటుందని అంటున్నారు.












Next Story