కుంభాభిషేకం నిర్వహించిన ముస్లింలు

Muslims Participates In Hindu Temple Kumbabishekam Tiruvarur. దేశంలో మతానికి సంబంధించిన వివాదాలు కొనసాగుతూ ఉన్న సంగతి తెలిసిందే..!

By Medi Samrat
Published on : 10 Jun 2022 11:13 AM

కుంభాభిషేకం నిర్వహించిన ముస్లింలు

దేశంలో మతానికి సంబంధించిన వివాదాలు కొనసాగుతూ ఉన్న సంగతి తెలిసిందే..! అయితే తమిళనాడు రాష్ట్రంలో ముస్లింలు కుంభాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. తిరువారూరు జిల్లా కూత్తనల్లూరులో హిందువులు, ముస్లింలు కలసికట్టుగా ముత్తుమారియమ్మన్‌ ఆలయ మహాకుంభాభిషేకాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆ ఆలయంలోని ముత్తుమారియమ్మన్‌ ఆలయం, ఆ ఆలయ ప్రాంగణంలోని వినాయకుడు, బాలమురుగన్‌ సన్నిధులకు 15 ఏళ్ల తర్వాత గురువారం ఉదయం కుంభాభిషేక మహోత్సవం నిర్వహించారు. ఆ మేరకు పండుతక్కడి గ్రామస్తులు, అక్కరై పుదువీది వాసులు, ముస్లింలు, భక్తులంతా కలిసి ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాల మండపంలో ప్రత్యేక వేదికపై పవిత్ర నదీజలాలున్న కలశాలను ప్రత్యేక వేదికపై ఉంచి విఘ్నేశ్వర పూజ సహా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం ఉదయం యాగపూజ గోపూజ, సరస్వతిపూజతో పూర్ణాహుతి జరిపారు. ఆ తర్వాత ఉదయం 10.15 గంటలకు తిరువాడుదురై కీర్తివాసన్‌ గురుక్కల్‌ పర్యవేక్షణలో ఆలయ ప్రధానార్చకులు కే బాలకృష్ణన్‌, మరో పదిమంది వేదపండితులు యాగశాలలోని పవిత్రజలాలున్న కలశాలలను గ్రామస్తులు, ముస్లిం మతపెద్దల సమక్షంలో ఊరేగింపుగా ఆలయ రాజగోపురాలపైకి తీసుకెళ్ళారు. ఆ తర్వాత గోపురకలశాలను పవిత్ర జలాలతో అభిషేకించారు.




Next Story