ముంబై లోని మీరా రోడ్‌లో తన భర్త, పిల్లలతో నివసిస్తున్న 32 ఏళ్ల మహిళకు ఊహించని సమస్య ఎదురైంది. తన సొంత సోదరే తనను బెదిరిస్తుందని అసలు ఊహించలేకపోయింది. లాక్‌డౌన్ సమయంలో తన 27 ఏళ్ల సోదరి ఆమెతో పాటు ఇంట్లో ఉండి ఐటీ కంపెనీలో ఇంటి నుండి పని చేస్తోంది. అయితే నవంబర్‌లో బాధితురాలి అత్తమామలు రావడంతో చెల్లెలు బయటకు వెళ్లాల్సి వచ్చింది.
"ఫిర్యాదు చేసిన మహిళ తన సోదరికి అప్పుడప్పుడు డబ్బు సహాయం చేస్తూనే ఉంది. వివిధ అబద్ధాలతో చెల్లెలు అక్క నుండి డబ్బులు తీసుకుంటూ వచ్చింది. ఆరు నెలల వ్యవధిలో ఆమె తన కొత్త ఇంటి కోసం బాధితురాలి నుండి రూ. 3 లక్షలు తీసుకుంది" అని ఒక పోలీసు అధికారి తెలిపారు. ఇద్దరు సోదరీమణులు సన్నిహితంగా ఉన్నారని, వారి గత సంబంధాల గురించి ఒకరి గురించి మరొకరికి తెలుసు. ఒకరితో ఒకరు చిత్రాలను కూడా పంచుకున్నారని పోలీసులు తెలిపారు.
"అయితే, ఫిబ్రవరిలో బాధితురాలికి డబ్బు తిరిగి అవసరం అయినప్పుడు, ఆమె డబ్బును తిరిగి ఇవ్వడానికి నిరాకరించడంతో వారు వాగ్వాదానికి దిగారు. పెళ్లికి ముందు బాధితురాలి తన స్నేహితుడితో సన్నిహితంగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని నిందితురాలు ఆమెను బెదిరించడం మొదలు పెట్టింది." బాధితురాలు మొదట బెదిరింపులను పట్టించుకోలేదు, కానీ చెల్లెలు తన కొన్ని పాత ఫోటోలను వాట్సాప్‌లో పంచుకోవడంతో షాక్ అయింది. ఫిబ్రవరి 19 న వాటిని పోస్ట్ చేస్తానని బెదిరించడంతో, ఆమె పోలీసులను ఆశ్రయించింది. " IPC సెక్షన్లు 384 (దోపిడీ) మరియు 506 (క్రిమినల్ బెదిరింపు) కింద కేసు నమోదు చేసాము" అని నయానగర్ పోలీస్ స్టేషన్ నుండి ఇన్స్పెక్టర్ రాజేష్ ఓజా తెలిపారు. ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదని ఆయన తెలిపారు.