'సత్యనారాయణ వ్రతం' సరిగా చేయలేదని పూజారిని చితక్కొట్టారు..!

MP man thrashes priest after 'Satyanarayan Puja' fails to get his son a bride. పూజలు చేసేస్తేనే అన్నీ జరిగిపోతాయని అనుకుంటూ ఉంటారు కొందరు.

By Medi Samrat  Published on  4 Oct 2022 8:43 AM IST
సత్యనారాయణ వ్రతం సరిగా చేయలేదని పూజారిని చితక్కొట్టారు..!

పూజలు చేసేస్తేనే అన్నీ జరిగిపోతాయని అనుకుంటూ ఉంటారు కొందరు. కానీ అన్నీ కలిసి వస్తేనే అనుకున్నవి దక్కుతాయనే విషయాన్ని గ్రహించలేరు. పూజ ఫలితం సరిగా లేదని ఏకంగా పూజారిని ఇష్టమొచ్చినట్లు కొట్టారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. 'సత్యనారాయణ వ్రతం' సరిగా చేయలేదని పూజారిని చితక్కొట్టారు. పూజ చేసే సమయంలో చేసిన ఆచారాలు తప్పుడు ఫలితాలకు దారితీశాయనే అనుమానంతో పూజారిని కొట్టారని పోలీసు అధికారి సోమవారం తెలిపారు.

రాజస్థాన్‌లోని కోటలో నివాసం ఉంటున్న పూజారి కుంజ్‌బిహారి శర్మను లక్ష్మీకాంత్ శర్మ తన ఇంట్లో పూజ చేయాలని ఆహ్వానించారు. అయితే ఆయన చేసిన పూజలు సరైన ఫలితాలు ఇవ్వలేదని లక్ష్మీకాంత్ శర్మ, అతని ఇద్దరు కుమారులు కొట్టారని చందన్‌నగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అభయ్ నేమా తెలిపారు. "స్కీమ్ నంబర్ 71 నివాసితులైన లక్ష్మీకాంత్ శర్మ.. అతడి కుమారులిద్దరూ కలిసి 60 ఏళ్ల పూజారిని కొట్టారు. లక్ష్మీకాంత్ శర్మ ఇంట్లో పలు పూజలు నిర్వహించడానికి ఆహ్వానించారని.. కార్యక్రమం ముగిసిన తర్వాత పూజారిని ఇష్టమొచ్చినట్లు కొట్టారు" అని పోలీసులు తెలిపారు.

పూజారి చేసిన పూజల కారణంగా తన కుమారుడికి పెళ్లి కుదరడం లేదనే కోపంతో లక్ష్మీకాంత్ శర్మ ఆయన కుమారులు.. పూజారి ఇంటికి వెళ్లి మరీ దాడి చేశారు. "అర్థరాత్రి, లక్ష్మీకాంత్ శర్మ.. అతని కుమారులు విపుల్, అరుణ్ పూజారిని కొట్టారు. విపుల్ అతని చెవిని కొరికాడు. ఆచారాలను తప్పుగా నిర్వహించడంతో అరుణ్ విచిత్రంగా ప్రవర్తించడం ప్రారంభించాడని దాడి చేసినవారు పేర్కొన్నారు" అని అధికారి తెలిపారు. ఇరుగుపొరుగు వారు అతన్ని రక్షించి ఆసుపత్రికి తరలించారు. లక్ష్మీకాంత్ శర్మ, అతని కుమారులు విపుల్, అరుణ్‌లను అరెస్టు చేసినట్లు నేమా తెలిపారు.


Next Story