కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా డిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన నిరసనలు 25వ రోజుకు చేరుకున్నాయి. చలిని సైతం లెక్కచేయకుండా రైతులు నిరసనదీక్షలు కొనసాగిస్తున్నారు. తాము తీసుకువచ్చిన చట్టాలతో ఎటువంటి నష్టం లేదని.. రైతులు లాభపడేందుకే నూతన చట్టాలను తీసుకొచ్చామని కేంద్రం చెబుతోంది. ఇప్పటికే కేంద్రం, రైతు సంఘాల మధ్య పలుమార్లు చర్చలు జరుగినప్పటికీ అవి సఫలం కాలేదు. కొత్త చట్టాలను రద్దు చేసే వరకు తాము విశ్రమించమని రైతు సంఘాలు చెబుతున్నాయి.
ఇక ఈ చట్టాలపై అవగాహాన కల్పించాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా మాజీ ప్రధాని వాజ్‌పేయీ జయంతిని పురస్కరించుకుని డిసెంబర్ 25న ప్రధాని నరేంద్ర మోడీ రైతులతో ముచ్చటించనున్నారు. ఉత్తరప్రదేశ్‌లో 2,500 ప్రాంతాల్లో కిసాన్ సంవాదక్ కార్యక్రమాలు చేపట్టనున్నారు.