'ఈ-రూపీ'ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

Modi Launches E-Rupee. భారతదేశంలో నగదు రహిత లావాదేవీలు భారీగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే..! డిజిటల్‌ ఇండియా

By Medi Samrat  Published on  2 Aug 2021 7:54 PM IST
ఈ-రూపీని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

భారతదేశంలో నగదు రహిత లావాదేవీలు భారీగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే..! డిజిటల్‌ ఇండియా లక్ష్య సాధనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నగదు రహిత చెల్లింపుల కోసం కొత్తగా పేమెంట్ విధానాన్ని ప్రవేశపెట్టంది. నేడు ప్రధాని నరేంద్ర మోదీ వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ఎల‌క్ట్రానిక్ వోచ‌ర్ ఈ-రూపీ (E- Rupi) డిజిటల్‌ చెల్లింపు ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించారు. డిజిటల్ లావాదేవీల కోసం ప్రస్తుతం ఫోన్ పే, గూగుల్ పే, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులు, అమెజాన్ పే, పేటీఎంతో పాటు చాలానే ఉన్నాయి. తాజాగా నగదు రహిత లావాదేవీల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ-రూపీ విధానాన్ని అందుబాటులో తీసుకువచ్చింది.

ఈ సంద‌ర్భంగా మోదీ మాట్లాడుతూ.. డిజిట‌ల్ లావాదేవీలు, నేరుగా న‌గ‌దు బ‌దిలీ విష‌యంలో దేశంలో ఈరూపీ కీల‌క‌పాత్ర పోషిస్తుందని వెల్లడించారు. పార‌ద‌ర్శకంగా ఎటువంటి లీకేజీలకు అవకాశం లేకుండా న‌గ‌దును డెలివ‌రీ చేయవచ్చన్న ఆయన.. అత్యాధునిక టెక్నాల‌జీ సాయంతో 21వ శ‌తాబ్ధంలో భారత్‌ ముందుకు వెళ్తున్న తీరుకు ఈ-రూపీని ఉదాహ‌ర‌ణ‌గా భావించ‌వ‌చ్చని వ్యాఖ్యానించారు.

నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. కేంద్ర ఆర్థిక సేవలు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సాయంతో ఈ-రూపీ రూపకల్పన ఈ కొత్త విధానాన్ని రూపొందించింది. నగదు చెల్లింపులను క్యూ ఆర్ కోడ్, ఎస్ఎంఎస్ స్ట్రింగ్ వోచర్ ద్వారా లబ్దిదారుడి మొబైల్ ఫోన్‌కు పంపిస్తారు. ఈ వోచర్, క్యూఆర్ కోడ్‌ను లబ్ధిదారుడు తనకు అవసరమైన చోట వినియోగించుకోవచ్చు. డిజిటల్ లావాదేవీల్ని మరింత వేగవంతం చేసే ప్రక్రియలో భాగంగా కేంద్రం ఈ-రూపీని తీసుకువస్తున్నది. ఈ కొత్త విధానం తొలిదశలో కేంద్రం నుంచి ఆర్థిక సాయం పొందే లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాలతో సంబంధం లేకుండానే ప్రభుత్వ సహాయం అందనుంది. మొబైల్‌ ఫోన్‌కు క్యూఆర్‌ కోడ్‌, ఎస్‌ఎంఎస్‌ వోచర్‌ రూపంలో నగదు చేరుతుంది.


Next Story