కోవిడ్ టీకా అభివృద్ధి, పంపిణీకి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో నీతి ఆయోగ్ అధికారులు కూడా పాల్గొన్నారు. దేశంలో జరుగుతున్న కోవిడ్ టీకా అభివృద్ధి, వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించిన అంశాలను ఆ సమావేశంలో చర్చించినట్లు ప్రధాని మోదీ తన ట్విట్టర్‌లో తెలిపారు.
దేశంలో వ్యాక్సిన్ అభివృద్ధిలో జరుగుతున్న పురోగతితో పాటు.. అనుమతులు, టీకాలను ఏ మేరకు ప్రొక్యూర్ చేయాలన్న అంశాలను పరిశీలించినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. టీకా మార్కెట్‌లోకి వస్తే.. ఎవరికి ముందుగా ఇవ్వాలో.. కోల్డ్ చైన్ నిల్వలు ఎలా ఉన్నాయో సమీక్షించినట్లు ప్రధాని వెల్లడించారు.
ఇదిలావుంటే.. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో పలు కంపెనీలు కరోనా టీకాను తయారు చేస్తున్నాయి. పలు దేశాల్లో వివిధ దశల్లోనూ ఆ వ్యాక్సిన్ ట్రయల్స్ సాగుతున్నాయి. కొన్ని టీకాలు అడ్వాన్స్‌డ్ దశలో ఉండగా. భారత్‌లో అయిదు వ్యాక్సిన్లు అడ్వాన్స్‌డ్ స్టేజ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.