కశ్మీర్‌లో ఉగ్రవాదుల కలకలం.. ఇంటర్నెట్ నిలిపివేత.!

Mobile, internet services suspended in Baramulla district. జమ్ముకశ్మీర్‌లోని యురి సెక్టార్‌లో ఇంటర్నెట్‌, మొబైల్ ఫోన్ సర్వీసు తాత్కలికంగా నిలిపివేయబడ్డాయి.

By Medi Samrat  Published on  21 Sept 2021 4:46 PM IST
కశ్మీర్‌లో ఉగ్రవాదుల కలకలం.. ఇంటర్నెట్ నిలిపివేత.!

జమ్ముకశ్మీర్‌లోని యురి సెక్టార్‌లో ఇంటర్నెట్‌, మొబైల్ ఫోన్ సర్వీసు తాత్కలికంగా నిలిపివేయబడ్డాయి. ఉగ్రవాదుల చొరబాట్లకు సంబంధించి వాస్తవాధీన రేఖ వెంబడిన తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు అధికారులు ప్రకటన విడుదల చేశారు. బారాముల్లా యురి సెక్టార్‌లో ఉగ్రవాదులు చొరబాట్లకు పాల్పడుతున్నట్లు గుర్తించామని ఆర్మీ అధికారులు తెలిపారు. ఎల్వోసీ వెంబడి ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఉగ్రవాదులను పట్టుకునేందుదకు ఆర్మీ బలగాలు విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని 15 కార్ప్స్ జనరల్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ జనరల్ డీపీ పాండే తెలిపారు.

యురి సెక్టార్‌లో ఇంటర్నెట్, ఫోన్‌ సర్వీసులను నిలిపివేయం ఇదే మొదటిసారి. యురి సెక్టార్‌పై దాడి జరిగి సెప్టెంబర్ 18, 2021తో ఐదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు. ఆరుగురు చొరబాటుదారుల బృందం పాక్‌ నుండి భారత్‌లోకి చొరబడిందని విశ్వసనీయ సమాచారం.

యురి ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు ఆత్మహుతి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 19 మంది జవాన్ల వీర మరణం పొందారు. అదే సమయంలో పాకిస్తాన్‌లో టెర్రరిస్టు లాంచ్‌ ప్యాడ్లపై భారత ఆర్మీ దాడులు జరిపింది. గత ఫిబ్రవరిలో భారత్‌, పాకిస్తాన్‌లు మరోసారి సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ తర్వాత టెర్రరిస్టులు భారత భూభాగంలోకి చొరబడటానికి యత్నించడం ఇది రెండో సారి.


Next Story