దేశ రాజధానిలోనూ భూకంపం..!

Metro services disrupted, commuters stranded after earthquake in Delhi. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం ఉదయం భూప్రకంపనలు వచ్చాయి.

By Medi Samrat
Published on : 26 July 2021 5:37 AM

దేశ రాజధానిలోనూ భూకంపం..!

దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం ఉదయం భూప్రకంపనలు వచ్చాయి. స్వల్పంగా భూమి కంపించడంతో ఒక్కసారిగా ఢిల్లీలో ఆందోళన మొదలయ్యింది. సోమవారం ఉదయం 6.42 గంటలకు భూప్రకంపనలు సంభవించడంతో కొంత సేపు మెట్రోరైళ్ల రాకపోకలను నిలిపివేశారు. దీంతో ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం ఏర్పడింది. ప్రయాణికులు ప్లాట్ ఫాంలలో నిలిచిపోయారు. మెట్రోరైళ్ల రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. భూప్రకంపనలతో ఎక్కడి మెట్రోరైళ్లను అక్కడ ఆపి వేయడంతో మెట్రో స్టేషన్లలో ప్రయాణికులు పెద్ద సంఖ్యలో నిలిచిపోయారు. అనంతరం భూప్రకంపనలు తగ్గడంతో మెట్రోరైళ్లను ముందుజాగ్రత్త చర్యగా తక్కువ వేగంతో నడిపారు.బదర్ పూర్ సరిహద్దు మెట్రో స్టేషనుతోపాటు పలు స్టేషన్ల వద్ద ప్రయాణికులు బారులు తీరారు.

ఆనంద్ విహార్ రైల్వేస్టేషనులో గేటు వేయడంతో ప్రయాణికులు వేచి ఉన్నారు. గంటసేపు మెట్రోరైళ్లను నిలిపివేశారని ప్రయాణికులు చెప్పారు.సాంకేతిక లోపం వల్లనే మెట్రోరైళ్లను కొద్దిసేపు ఆపివేశామని మెట్రో అధికారులు చెప్పారు.

నాగర్ కర్నూల్ లో కూడా భూమి కంపించింది.రిక్టర్ స్కేలుపై నాలుగు కంటే అధికంగా తీవ్రత నమోదు కావడంతో నాగర్ కర్నూల్ వాసులు భయాందోళనలు చెందుతున్నారు. హైదరాబాద్ లో కూడా భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే..! హైదరాబాద్ సమీపంలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 4.0గా నమోదయ్యింది. హైదరాబాద్‌కు 156 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. సోమవారం ఉదయం 5 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 4.0గా నమోదయింది. హైదరాబాద్‌కు దక్షిణంగా 150 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (ఎన్‌సీఎస్‌) వెల్లడించింది.


Next Story