బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ చంపిన.. కృష్ణజింకలకు రాజస్థాన్‌లో స్మారక చిహ్నం
Memorial in Rajasthan for blackbucks killed by Salman Khan. 24 ఏళ్ల క్రితం రాజస్థాన్‌లో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలను వేటాడిన విషయం తెలిసిందే. తాజాగా కంకణి గ్రామంలో వేటాడి
By అంజి Published on 9 Jan 2022 6:38 AM GMT24 ఏళ్ల క్రితం రాజస్థాన్‌లో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలను వేటాడిన విషయం తెలిసిందే. తాజాగా కంకణి గ్రామంలో వేటాడి చంపిన తర్వాత పాతిపెట్టిన కృష్ణజింకల జ్ఞాపకార్థం బిష్ణోయ్ వర్గానికి చెందిన యువకులు భారీ స్మారక చిహ్నం ఏర్పాటు చేస్తున్నారు. కృష్ణజింకలను వేటాడిన వారిలో సల్మాన్ ఖాన్‌తో పాటు నటులు సైఫ్ అలీఖాన్, టబు, నీలం ఉన్నారు. చనిపోయిన కృష్ణజింకలను సమాధి చేసిన భూమికి త్వరలో స్మారక చిహ్నం ఏర్పాటు చేస్తామని యువకుడు ప్రేమ్ శరణ్ అన్నారు. స్మారక చిహ్నంలో కృష్ణజింక విగ్రహం ఉంటుంది. మూగ జంతువును ఖననం చేసిన భూమిలో 1,000 చెట్లను నాటడం జరుగుతుందని, తన కమ్యూనిటీకి చెందిన కొంతమంది యువకులు వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేశారని, ఇది నిధుల సేకరణ డ్రైవ్‌ను ప్రారంభించిందని ఆయన చెప్పారు. స్మారకం చిహ్నం కోసం తమ వద్ద దాదాపు రూ.2 లక్షలు ఉన్నాయని, ఒక్కొక్కరి నుంచి దాదాపు రూ.500 నుంచి రూ.1000 వరకు వసూలు చేస్తున్నామని చెప్పారు.
ఇటీవల జెసిబి యంత్రాలతో ఒక బృందం వచ్చి.. స్మారక చిహ్నం ఏర్పాటు చేసే భూమి వద్ద గల శిథిలాల తొలగించింది. ఇప్పుడు మేము చెట్లను పెంచడం, కృష్ణ జింక విగ్రహాన్ని నిర్మించడం ప్రారంభించాము. ఈ స్మారకాన్ని ఏడాదిలోగా నిర్మిస్తామని ప్రేమ్ తెలిపారు. చెట్లు పెరగడానికి సమయం పట్టడమే దీనికి కారణం. జింకలు, కృష్ణజింకలు, ఇతర జంతువులు ఇక్కడ ఉన్నప్పుడు అడవి అనుభూతిని కలిగి ఉండాలని మేము కోరుకుంటున్నాము. ప్రజలు అటుగా వెళుతున్నప్పుడు చాలా జింకలు భయపడి చనిపోతాయి. కాబట్టి మేము వాటిని సురక్షితంగా రక్షించాలనకుంటున్నామని చెప్పారు. జింకలు, కృష్ణజింకలు స్వేచ్చగా సంచరిస్తూ ఉండే భూమి ఇది. పర్యాటకులుగా బాలీవుడ్ తారలుగా ఇక్కడకు వచ్చారు. కానీ తరువాత జంతువులను కాల్చారు. అయితే మేము దట్టమైన అడవిని సృష్టిస్తాము, తద్వారా జంతువులు దాని ఆకుపచ్చ అంచులో సురక్షితంగా ఉంటాయి. అని ప్రేమ్ శరణ్ చెప్పారు.
ప్రస్తుతం అటవీ బృందం రావడానికి చాలా సమయం పడుతుందని, ఏదైనా జంతువు గాయపడితే వెంటనే చికిత్స చేయవచ్చని, ఆ స్థలంలో వైద్యులతో రెస్క్యూ సెంటర్ ఉండేలా చూస్తామని ప్రేమ్ చెప్పారు. చబుత్రా చుట్టుపక్కల దాదాపు 7 బిఘాల భూమిని ఇటీవల జేసీబీ యంత్రాలతో క్లియర్ చేయగా, ఇప్పుడు దాదాపు 1000 చెట్లను నాటబోతున్నారు. కృష్ణ జింకల వేట విషయంలో ఏప్రిల్ 5, 2018న, రాజస్థాన్ సెషన్స్ కోర్టు సల్మాన్ ఖాన్‌ను దోషిగా నిర్ధారించి, అతనికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ శిక్షపై సల్మాన్ తరపు న్యాయవాదులు అప్పీల్ చేశారు. ఈ కేసు రాజస్థాన్ హైకోర్టులో ఇంకా పెండింగ్‌లో ఉంది.