Video : మ‌రో ఘ‌ట‌న.. గుండెపోటుతో జిమ్‌లోనే ప్రాణాలు వ‌దిలాడు..!

మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో ఓ వ్యక్తి జిమ్‌లో గుండెపోటుతో మృతి చెందాడు. జిమ్‌లోని సీసీటీవీ ఫుటేజీలో ఈ ఘటన రికార్డు అయింది

By Medi Samrat  Published on  22 July 2024 7:42 PM IST
Video : మ‌రో ఘ‌ట‌న.. గుండెపోటుతో జిమ్‌లోనే ప్రాణాలు వ‌దిలాడు..!

మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో ఓ వ్యక్తి జిమ్‌లో గుండెపోటుతో మృతి చెందాడు. జిమ్‌లోని సీసీటీవీ ఫుటేజీలో ఈ ఘటన రికార్డు అయింది. ఈ ఘటనలో కన్వల్‌జిత్ సింగ్ బగ్గా అనే వ్యక్తి ఇతరులతో కలిసి కొన్ని వ్యాయామాలు చేస్తున్నట్లు చూపబడింది. అయితే బగ్గా మాత్రం కాస్త అసౌకర్యంగా కనిపించాడు. మిగిలిన వాళ్లు వ్యాయామాన్ని కొనసాగిస్తూ ఉండగా.. బగ్గా నిదానంగా కదులుతూ కనిపించాడు. కొన్ని క్షణాల్లో బగ్గా ఓ పిల్లర్ కు ఆనుకుని.. అక్కడే కుప్పకూలిపోయాడు. బగ్గా కిందపడిపోవడం చూసిన ఇతరులు అతడి వద్దకు పరిగెత్తుకుని వెళ్లారు. ఏమైందో జరిగిందో తెలియక మిగిలిన వాళ్లు అటూ ఇటు పరిగెత్తడం వీడియోలో రికార్డు అయింది. బగ్గా అలా కుప్పకూలిన కొన్ని క్షణాల్లో మరణించారని వైద్యులు ధృవీకరించారు.

జిమ్‌లలో గుండెపోటు సంఘటనలు ఇటీవల పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. కన్వల్‌జిత్ సింగ్ బగ్గాకు వెంటనే సీపీఆర్ చేసి ఉండి ఉంటే బతికి ఉండేవారని పలువురు నెటిజన్లు సూచిస్తూ ఉన్నారు.


Next Story