అద్దెకున్న మహిళకు ఇన్నర్ వేర్లు గిఫ్ట్ గా ఇస్తున్న ఓనర్

Man gifts tenant innerwear. ఓ ఇంటి యజమాని.. తన ఇంట్లో ఉండే మహిళకు ఇన్నర్ వేర్ లను గిఫ్ట్ గా ఇవ్వడం

By Medi Samrat
Published on : 18 Jan 2022 4:48 PM IST

అద్దెకున్న మహిళకు ఇన్నర్ వేర్లు గిఫ్ట్ గా ఇస్తున్న ఓనర్

ఓ ఇంటి యజమాని.. తన ఇంట్లో ఉండే మహిళకు ఇన్నర్ వేర్ లను గిఫ్ట్ గా ఇవ్వడం మొదలు పెట్టాడు. ఆ మహిళ పుట్టినరోజున లోదుస్తులను ఇవ్వడమే కాకుండా.. ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడనే ఆరోపణలపై ఫిర్యాదు నమోదైంది. ఫిర్యాదు చేసిన 42 ఏళ్ల ఉపాధ్యాయురాలిని పద్మనాభ అనే వ్యక్తి ఇంట్లో నివసిస్తూ ఉన్నారు. అతడి వేధింపులు తాళలేక బాధిత మహిళ బెంగళూరులోని హనుమంతనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సదరు బాధిత మహిళ గత 12 ఏళ్లుగా అద్దె ఇంట్లో ఉంటోంది. పద్మనాభం ఆమె పుట్టినరోజున ఆమెకు ఓ బహుమతిని ఇచ్చినట్లు తెలిపింది.

పెట్టె తెరవగానే అందులో ప్యాక్ చేసిన లోదుస్తులు చూసి ఆశ్చర్యపోయింది. నిందితుడు ఆమెను బయటకు రమ్మని ఆహ్వానించడం, ఫోన్ ద్వారా లైంగిక ప్రయోజనాలను కోరడం ప్రారంభించాడు. పాఠశాల ఉపాధ్యాయురాలు అతని అభ్యర్థనలను తిరస్కరించగా.. అతను ఆమెను ఇల్లు ఖాళీ చేయమని డిమాండ్ చేయడం ప్రారంభించాడు. కొన్ని కొన్ని సార్లు అతడు నన్ను ఎన్నో ఇబ్బందులకు గురిచేశాడని బాధిత మహిళ పోలీసులకు తెలిపింది. తాను లోపల నిద్రిస్తున్న సమయంలో అతడు ఒకసారి గేటు బయట నుంచి తాళం వేశాడని మహిళ పేర్కొంది. ఇంటి యజమానిని పోలీసులు విచారించగా, ఇంటిని ఖాళీ చేయమని కోరడంతో తనపై తప్పుడు ఫిర్యాదులు చేస్తోందని తెలిపాడు.


Next Story