సెంట్రల్ ఢిల్లీలోని విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పి) కార్యాలయాన్ని బాంబులతో పేల్చివేస్తామని బెదిరించిన ఆరోపణలపై మధ్యప్రదేశ్‌కు చెందిన 26 ఏళ్ల యువకుడిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విహెచ్‌పి, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) వంటి సంస్థల సభ్యులు అతనిని అవమానించారని చెబుతున్నారు.
డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సెంట్రల్) శ్వేతా చౌహాన్ మాట్లాడుతూ.. సదరు వ్యక్తిని ప్రిన్స్ పాండేగా గుర్తించామని అన్నారు. అతను గ్రాడ్యుయేట్ అని చెప్పుకుంటున్నాడు."ఒక వ్యక్తి తమ భవనంలో బాంబు బెదిరింపులు ఇస్తున్నారని.. మేము సంఘటనా స్థలానికి ఒక బృందాన్ని పంపాము. వారు పాండేని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల తన కుటుంబ సభ్యుల్లో ఒకరిని బలవంతంగా మతం మార్చారని విచారణలో ఆరోపించారు. అతను ఆర్‌ఎస్‌ఎస్, ఇతర సంస్థల నుండి సహాయం తీసుకోవాలనుకున్నాడు" అని డిసిపి చెప్పారు.
తాను ఆర్‌ఎస్‌ఎస్ మద్దతుదారునిగా చెప్పుకున్నాడు. ఎంతో మనోవేదనలతో ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించానని.. తన బంధువుకు సాయం చేసేందుకు ఎవరూ రాలేదని వాపోయారు. తనకు ఎవరూ సహాయం చేయలేదని అతను ఆరోపించాడు, ఆపై నాయకుల దృష్టిని ఆకర్షించడానికి బెదిరింపులకు పాల్పడ్డాడని డిసిపి తెలిపారు.