డబ్బులు సంపాదించాలని హిజ్రాగా వేషం కట్టిన వ్యక్తి.. నిజమైన హిజ్రాలకు తెలియడంతో

Man became eunuch for money, suddenly faced real eunuchs. ఒక వ్యక్తి హిజ్రాగా వేషం కట్టి ప్రజల నుండి డబ్బు వసూలు చేస్తుండగా.. నిజమైన హిజ్రాలు అక్కడికి రావడంతో సీన్ మొత్తం రివర్స్

By అంజి  Published on  15 Feb 2022 5:37 PM IST
డబ్బులు సంపాదించాలని హిజ్రాగా వేషం కట్టిన వ్యక్తి.. నిజమైన హిజ్రాలకు తెలియడంతో

ఒక వ్యక్తి హిజ్రాగా వేషం కట్టి ప్రజల నుండి డబ్బు వసూలు చేస్తుండగా.. నిజమైన హిజ్రాలు అక్కడికి రావడంతో సీన్ మొత్తం రివర్స్ అయిన షాకింగ్ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని మందసౌర్ లో చోటు చేసుకుంది. ఆ వ్యక్తికి నిజమైన హిజ్రాలు ఎదురై.. అతడిని చితక్కొట్టారు. ఆగ్రహించిన హిజ్రాలు ఆ వ్యక్తి కట్టుకున్న చీరను కూడా చించివేశారు. ఈ ఘటనపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు చోటు చేసుకోలేదు. ఈ కేసు మందసౌర్ జిల్లాలోని పిప్లియా మండి పోలీస్ స్టేషన్ పరిధిలోని బహి గ్రామానికి చెందినది. ఇక్కడ ఓ వ్యక్తి నకిలీ హిజ్రాలా నటిస్తూ గ్రామ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడు. దీంతో ఒక్కసారిగా అసలు హిజ్రాలు అక్కడికి చేరుకున్నారు.

ఆ వ్యక్తిని విచారించడం ప్రారంభించారు. అనుమానంతో, వారు అతనిని పట్టుకుని కొట్టడం ప్రారంభించారు. ఆవేశంతో ఆ వ్యక్తి చీరను కూడా చించి, గ్రామం మొత్తం నగ్నంగా ఊరేగించారు. ఈ కేసుకు సంబంధించిన వీడియోను ప్రజలు రికార్డ్ చేశారు, అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పిప్లియా మండి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ తేజేంద్ర సింగ్ సెంగార్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఘటనలో బాధితులెవరూ ఫిర్యాదు చేయడం కోసం పోలీస్ స్టేషన్‌కు రాలేదు. చాలా కాలంగా ఆ వ్యక్తి గ్రామంలో నకిలీ హిజ్రాలా తిరుగుతున్నాడని తెలిపారు. ఈ వార్త నిజమైన హిజ్రాలకు తెలియగానే, వారు కొట్టారు.

Next Story