ఫలితాలు రాకముందు వరకూ భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్ లో తప్పకుండా విజయం సాధించబోతోంది అనే ప్రచారం సాగింది. ఇక ఈసారి తప్పకుండా మూడంకెల మార్కును అందుకుని.. దీదీకి చెక్ పెడతామని ప్రధాని మోదీ దగ్గర నుండి పశ్చిమ బెంగాల్ బీజేపీ నేతల వరకూ చెప్పుకొచ్చారు. కానీ ఎన్నికల ఫలితాలు రాగానే బీజేపీ డీలా పడిపోయింది.

బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్‌ వర్గియా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విజయం పూర్తిగా మమతా బెనర్జీ వల్లే సాధ్యమైందని అన్నారు. దీనిపై తాము ఆత్మ పరిశీలన చేసుకుంటామని.. ప్రజలు దీదీకే పట్టం కట్టారంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఆమెనే సీఎం కావాలని కోరుకున్నారన్నారు. బెంగాల్‌ ఎన్నికల్లో తమ పార్టీ వైఖరి, వైఫ్యల్యం నేపథ్యంలో తప్పు ఎక్కడ జరిగిందో సమీక్షించుకుంటామని అన్నారు. ఫలితాల తీరుపై ఆరా తీసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుంచి తనకు పిలుపు వచ్చిందని కైలాష్ తెలిపారు. అలాగే బీజీపీ ఎంపీలు బాబుల్ సుప్రియో, లాకెట్ ఛటర్జీ వెనుకంజలో ఉండటం చూసి తాను షాక్ అయ్యానని అన్నారు.

నందిగ్రామ్ లో సువేందు అధికారి మమతా బెనర్జీని ముచ్చెమటలు పట్టించారు. మొద‌ట 1200 ఓట్ల‌తో ఇక్క‌డ మ‌మ‌త గెలిచిన‌ట్లుగా మీడియా అంతా ప్ర‌చారం చేసింది. అయితే చివ‌రికి సువేందు 1,736పైగా ఓట్లతో గెలుపొందారు.సామ్రాట్

Next Story