బెంగాల్‌లో బాబ్రీ మసీదుకు పునాది వేస్తామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తృణమూల్ నేత, భరత్‌పూర్ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్‌పై వేటు వేశారు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు టీఎమ్‌సీ ప్రకటించింది. బీజేపీ మద్దతుతో ఆయన మతసామరస్యం దెబ్బతినే వ్యాఖ్యలు చేశారని టీఎమ్‌సీ నేతలు చెబుతున్నారు.
కబీర్ ప్రకటనలు శాంతిభద్రతల సమస్యను సృష్టిస్తుంటే, ఆయనను ఎందుకు అరెస్టు చేయడం లేదని బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. "క్షేత్ర స్థాయి, నిఘా సంస్థలు, స్థానిక నాయకుల నుండి నివేదికలు అందాయి, ఎవరో ఉద్దేశపూర్వకంగా ముర్షిదాబాద్‌ను కుంభకోణాల కేంద్రంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారని సూచిస్తున్నాయి. దీనిని అనుమతించబోము. మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొడితే, రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఎందుకు ఉంది" అని ఆయన అన్నారు.