మహారాష్ట్రలోని నాందేడ్‌లో షాకింగ్ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆంచల్ అనే అమ్మాయి కుటుంబ సభ్యులు ఆమె ప్రేమికుడు సక్షమ్‌ను హత్య చేశారు. వేరే మతానికి చెందిన అమ్మాయిని ప్రేమించడమే అబ్బాయి చేసిన నేరం. ఆంచల్ కుటుంబం ఈ ప్రేమను వ్యతిరేకించడంతో ఆమె సోదరుడు, తండ్రి కలిసి సక్షమ్‌ను హత్య చేశారు. వీరు ముందుగా కూతురి ప్రియుడిని కొట్టి, ఆపై తలపై కాల్చారు. అంతటితో తృప్తి చెందక ఇద్దరూ కలిసి రాయితో తలను చిందరవందరగా చితక్కొట్టారు.
సక్షమ్ హత్య చాలా కిరాతకంగా ఉండటంతో ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు సైతం ఉలిక్కిపడ్డారు. ఈ సంఘటన నాందేడ్‌లోని మిలింద్ నగర్ ప్రాంతంలో ఇత్వారా పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం జరిగింది. సక్షమ్ హత్య గురించి సమాచారం అందుకున్న ఆంచల్.. అతడి ఇంటికి వెళ్లి అతని మృతదేహాన్ని వివాహం చేసుకుంది.