బంగాళాఖాతంలో భూకంపం

వరుస భూకంపాలు ప్రజలను భయకంపితులను చేస్తున్నాయి. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NSC) ప్రకారం బంగాళాఖాతంలో 4.2 తీవ్రతతో భూకంపం సంభవించింది

By Medi Samrat  Published on  7 Nov 2023 12:00 PM IST
బంగాళాఖాతంలో భూకంపం

వరుస భూకంపాలు ప్రజలను భయకంపితులను చేస్తున్నాయి. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NSC) ప్రకారం బంగాళాఖాతంలో 4.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. మంగళవారం ఉదయం 5:32 గంటలకు, 10 కి.మీ లోతులో భూకంపం సంభవించింది. తీర ప్రాంతాల్లో హైఅలర్ట్‌ ప్రకటించిన అధికారులు.. సునామీ ముప్పు లేదని తెలిపారు.

మంగళవారం తెల్లవారుజామున 5.32 గంటలకు బంగాళాఖాతంలో భూమి కంపించింది. దీని తీవ్రత 4.2గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (NCS) తెలిపింది. అండమాన్‌ నికోబార్‌ దీవులకువాయవ్య దిశగా సుమారు 200 నాటికల్‌మైళ్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సముద్రగర్భంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని తెలిపింది. భూకంపం వల్ల అండమాన్‌ నికోబార్‌ దీవులు ప్రభావితమయ్యాయి. తీరంలో అలలు పోటెత్తడంతో సముద్రంలో అల్లకల్లోలంగా మారింది.

Next Story