వెల్లూరులో 3.6 తీవ్రతతో భూకంపం.. మరో వైపు భారీ వర్షాలు.!

Magnitude 3.6 earthquake hits vellore in tamilnadu. తమిళనాడులో భూప్రకంపనలు వచ్చాయి. వెల్లూరులో సోమవారం తెల్లవారుజామున 4.17 గంటలకు భూకంపం వచ్చింద

By అంజి  Published on  29 Nov 2021 8:00 AM IST
వెల్లూరులో 3.6 తీవ్రతతో భూకంపం.. మరో వైపు భారీ వర్షాలు.!

తమిళనాడులో భూప్రకంపనలు వచ్చాయి. వెల్లూరులో సోమవారం తెల్లవారుజామున 4.17 గంటలకు భూకంపం వచ్చిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ పేర్కొంది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 3.6గా నమోదు అయ్యింది. వెల్లూరుకు పశ్చిమ-నైరుతి దిశలో 59 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని తెలిపింది. భూమి లోపల 25 కిలోమీటర్ల లోతులో భూప్రకంపనలు వచ్చినట్లు అధికారులు చెప్పారు. అయితే ఈ భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. మరో వైపు తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు, రహదారులు పూర్తిగా నీట మునిగిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మిజోరాంలో గత శుక్రవారం కూడా భారీ భూకంపం వచ్చింది. శుక్రవారం ఉదయం 5.15 గంటలకు మిజోరాంలో 6.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. బంగ్లాదేశ్‌తో పాటు కలకత్తా, ఈశాన్య రాష్ట్రాల్లో భూప్రకంపనలు వచ్చాయి. ఇటీవల తరచుగా దేశంలో ఏదో ఓ చోట భూప్రకంపనలు వస్తూనే ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని అనేక ప్రాంతాల్లో కూడా ఈ ప్రకంపనలు సంభవించాయని, ఇప్పటివరకు ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు ఎటువంటి నివేదిక రాలేదని అధికారులు తెలిపారు. అస్సాం, మిజోరాం, మణిపూర్, త్రిపురలోని పలు చోట్ల, అలాగే పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా, అలీపుర్‌దువార్, డార్జిలింగ్, జల్‌పైగురి జిల్లాల్లో ప్రకంపనలు సంభవించాయని అధికారులు తెలిపారు.


Next Story