విద్యార్థిని ఫిర్యాదు.. స్కూల్‌ టాయిలెట్‌ను శుభ్రం చేసిన మధ్యప్రదేశ్‌ మంత్రి

Madhya Pradesh minister cleans toilet at government school in Gwalior. మధ్యప్రదేశ్‌లో ఓ మంత్రి పాఠశాల మరుగుదొడ్డిని శుభ్రం చేసి వార్తల్లోకి ఎక్కారు. శుక్రవారం నాడు గ్వాలియర్‌లోని ఒక ప్రభుత్వ పాఠశాలలోని

By అంజి  Published on  18 Dec 2021 5:35 AM GMT
విద్యార్థిని ఫిర్యాదు.. స్కూల్‌ టాయిలెట్‌ను శుభ్రం చేసిన మధ్యప్రదేశ్‌ మంత్రి

మధ్యప్రదేశ్‌లో ఓ మంత్రి పాఠశాల మరుగుదొడ్డిని శుభ్రం చేసి వార్తల్లోకి ఎక్కారు. శుక్రవారం నాడు గ్వాలియర్‌లోని ఒక ప్రభుత్వ పాఠశాలలోని మరుగుదొడ్డిని మధ్యప్రదేశ్ ఇంధన శాఖ మంత్రి ప్రధుమన్ సింగ్ తోమర్ శుభ్రం చేశారు. ఈ సందర్భంగా పరిశుభ్రత సందేశాన్ని ఆయన ప్రచారం చేశారు. "పాఠశాలలోని మరుగుదొడ్లలో పరిశుభ్రత లేదని, దాని వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఒక బాలిక నాతో చెప్పింది" అని మంత్రి ప్రధుమాన్ సింగ్ తోమర్ మీడియాకి చెప్పారు.

"నేను 30 రోజుల పరిశుభ్రత ప్రతిజ్ఞ చేశాను. నేను ప్రతి రోజు ఏదో ఒక సంస్థకు వెళ్లి దానిని శుభ్రం చేస్తాను, శుభ్రత సందేశం ప్రజలందరికీ చేరాలని కోరుకుంటున్నాను, ప్రతి ఒక్కరూ పరిశుభ్రత వైపు ప్రేరేపించబడాలని నేను దీన్ని చేస్తున్నాను." అని మంత్రి ప్రధుమన్‌ చెప్పారు. పరిశుభ్రత పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేయడంతో పాటు పాఠశాలల్లోని మరుగుదొడ్లను ప్రతిరోజూ శుభ్రంగా ఉంచాలని మున్సిపల్ అధికారులను మంత్రి ఆదేశించారు.


Next Story