మీసాలు ట్రిమ్ చేసుకోలేదని.. కానిస్టేబుల్ సస్పెండ్
Madhya Pradesh Constable Suspended For Refusing to Trim Hair, Moustache. మీసాలు కత్తిరించుకోకపోవడంతో ఓ కానిస్టేబుల్ సస్పెన్షన్‌కు గురయ్యారు. జుట్టు, మీసాలు కత్తిరించమని
By అంజి Published on 10 Jan 2022 5:53 AM GMTమీసాలు కత్తిరించుకోకపోవడంతో ఓ కానిస్టేబుల్ సస్పెన్షన్‌కు గురయ్యారు. జుట్టు, మీసాలు కత్తిరించమని చెప్పినప్పటికీ క్రమశిక్షణా రాహిత్యానికి కారణమైన ఒక కానిస్టేబుల్‌ను మధ్యప్రదేశ్ పోలీసులు సస్పెండ్ చేశారు. పోలీసు మోటారు రవాణా విభాగంలో డ్రైవర్‌గా పోస్ట్ చేయబడిన కానిస్టేబుల్ రాకేష్ రాణాపై శుక్రవారం జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వు ఆదివారం వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్‌గా మారింది. "నా మీసాలను సరైన పరిమాణంలో కత్తిరించమని నన్ను అడిగారు, కానీ నేను నిరాకరించాను. ఉద్యోగం నుండి తొలగించినా సరే.. నేను అలా చేయనని'' రాకేష్ అన్నారు.
ఆర్డర్ జారీ చేసిన అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్, కోఆపరేటివ్స్ ఫ్రాడ్, పబ్లిక్ సర్వీస్ గ్యారెంటీ ప్రశాంత్ శర్మ.. రాకేష్ రాణా తన రూపాన్ని సరిదిద్దడానికి తన సీనియర్ ఆదేశాలను పాటించనందున సస్పెండ్ చేసినట్లు తెలిపారు. "అతని రూపాన్ని తనిఖీ చేసినప్పుడు, కానిస్టేబుల్ మెడ వరకు జుట్టు, మీసాలతో కనిపించాడు. అతని ముఖం విచిత్రంగా ఉన్నందున జుట్టును కత్తిరించమని ఆదేశించబడింది, కానీ అతను ఆదేశాలను పాటించలేదు. "అని అధికారి తెలిపారు. కానిస్టేబుల్ పొడవాటి జుట్టు, మీసాలు ఉంచుకోవడంలో మొండిగా ఉన్నారని, ఇది యూనిఫాం ధరించిన సిబ్బందికి నిబంధనలకు అనుగుణంగా లేదని శర్మ పేర్కొన్నారు. అందుకే క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అతడిని సస్పెండ్ చేసినట్లు అధికారి తెలిపారు.
మధ్యప్రదేశ్ పోలీసులు కానిస్టేబుల్ డ్రైవర్ రాకేశ్ రాణాను తన పొడవాటి జుట్టు, మీసాలు కత్తిరించడానికి నిరాకరించినందుకు సస్పెండ్ చేశారు. అయితే మీసాలు తన ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం కాబట్టి.. మీసాలు మెలేస్తూనే ఉంటానని ఓ టీవీ ఛానెల్‌తో అన్నారు. తాను ఎప్పుడూ సరైన యూనిఫాం ధరిస్తానని పేర్కొన్న రానా, చాలా కాలంగా మీసాలు పెంచుతున్నందున సస్పెన్షన్‌కు గురైనప్పటికీ ఈ విషయంలో రాజీపడనని చెప్పాడు.