నటి తునీషా శర్మ మృతి కేసును సక్రమంగా విచారించి.. ఆమె కుటుంబానికి న్యాయం చేస్తామని భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎమ్మెల్యే రామ్ కదమ్ ఆదివారం అన్నారు. లవ్ జిహాద్ కోణంలో కూడా కేసును విచారిస్తామని తెలిపారు. "తునీషా శర్మ కుటుంబానికి న్యాయం జరుగుతుంది. కేసు లవ్ జిహాద్‌తో ముడిపడి ఉందో లేదో కనుగొంటాము. లవ్ జిహాద్ లింక్ ఉంటే.. దాని వెనుక ఉన్న కుట్రదారులు, సంస్థలు బహిర్గతమవుతాయి"అని ఎమ్మెల్యే రామ్ కదమ్ అన్నారు.
తునీషా శర్మ.. టీవీ షో అలీ బాబా: దస్తాన్-ఇ-కాబుల్ షూటింగ్‌కు హాజరై.. అక్కడ ఆత్మహత్య చేసుకొని మరణించింది. నాయిగావ్‌లోని సెట్స్‌లో మేకప్ రూమ్‌లో తునీషా శర్మ ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. తునీషా శర్మ మరణం తర్వాత.. పోలీసులు ఆమె సహనటుడు షీజన్ మహ్మద్ ఖాన్‌ను అరెస్టు చేశారు. తునీషా శర్మ.. షీజన్ ఖాన్‌తో గతంలో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు.. అతనితో విడిపోవడమే ఆత్మహత్యకు ప్రేరేపించి ఉండవచ్చనే కథనాలు వెలువడ్డాయి. షీజన్ ఖాన్‌ను ఈరోజు ముంబైలోని వసాయ్ కోర్టులో హాజరుపరచగా.. 4 రోజుల పోలీసు కస్టడీకి పంపారు.