ఏడు దశల లోక్‌సభ ఎన్నికలలో భాగంగా నేడు ఐదవ దశలో ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. ఈ దశలో ఉత్తరప్రదేశ్‌లో 14, మహారాష్ట్రలో 13, పశ్చిమ బెంగాల్‌లో 7, ఒడిశాలో 5, బీహార్‌లో 5, జార్ఖండ్‌లో 3, జమ్మూకశ్మీర్‌లో ఒకటి, లడఖ్‌లో ఒక స్థానానికి పోలింగ్ జరుగుతోంది. బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలోని పోలింగ్ బూత్‌లో ఓటింగ్ ప్రారంభం కాకముందే పెద్ద సంఖ్యలో మహిళా ఓటర్లు వరుసలో నిలబడి కనిపించారు. పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ ముంబైలోని పోలింగ్ బూత్ వద్ద క్యూలో కనిపించారు.
ఇక ఐదో దశలో చాలా మంది ప్రముఖులు ఎన్నికల బరిలో ఉన్నారు. వీరిలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, రాహుల్ గాంధీ, చిరాగ్ పాశ్వాన్, రాజీవ్ ప్రతాప్ రూడీ, రోహిణి ఆచార్య, ఒమర్ అబ్దుల్లా, పీయూష్ గోయల్ వంటి దిగ్గజాలు ఉన్నారు. ఐదో దశతో మొత్తం 428 స్థానాలకు ఎన్నికలు పూర్తవుతాయి.