కరోనా థర్డ్ వేవ్ గురించి ప్రజల్లోనూ, ప్రభుత్వాల్లోనూ ఆందోళనలు ఉన్న సంగతి తెలిసిందే..! అందుకే ముందు జాగ్రత్త చర్యగా కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ఆంక్షలను కొనసాగిస్తూనే ఉన్నాయి. తమిళనాడు ప్రభుత్వం జూలై 19 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు శనివారం ప్రకటించింది. హోటళ్లు, టీ షాపులు, బేకరీలు, చిరు తిండ్ల షాపులు 50 శాతం సామర్థ్యంతో రాత్రి 9 గంటల వరకు నిర్వహించుకునేలా సడలింపులు ఇచ్చింది ప్రభుత్వం.
భైతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, శానిటైజర్లు వాడటం వంటి కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని ప్రజలను కోరారు. పుదుచ్చేరితో రవాణా కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. పాఠశాలలు, కాలేజీలు, థియేటర్లు, మద్యం దుకాణాలు, స్విమ్మింగ్ ఫూల్స్, జూలు తదుపరి ఆదేశాల వరకు మూసే ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. తమిళనాడులో శుక్రవారం కొత్తగా 3039 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 69 మంది కోవిడ్ బాధితులు మరణించారు.