2012 నుండి భారత్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదాలు ఇవే
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో శుక్రవారం జరిగిన ట్రిపుల్ రైలు ప్రమాదంలో కనీసం 238 మంది మరణించారు. 900 మంది గాయపడ్డారు.
By అంజి Published on 3 Jun 2023 1:30 PM ISTIndia, Odisha, train accident, National news
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో శుక్రవారం జరిగిన ట్రిపుల్ రైలు ప్రమాదంలో కనీసం 238 మంది మరణించారు. 900 మంది గాయపడ్డారు. ఇది ఇటీవలి చరిత్రలో భారతదేశంలో జరిగిన ఘోర రైలు ప్రమాదాలలో ఒకటి.
గత 10 సంవత్సరాలలో భారతదేశంలో జరిగిన ప్రధాన రైలు ప్రమాదాల వివరాలు ఇక్కడ ఉన్నాయి.
2012 : మే 22న హంపి ఎక్స్‌ప్రెస్ ప్రమాదం జరిగింది. కార్గో రైలు - హుబ్లీ-బెంగళూరు హంపి ఎక్స్‌ప్రెస్ ఆంధ్రప్రదేశ్‌కి సమీపంలో ఢీకొన్నాయి. రైలు నాలుగు బోగీలు పట్టాలు తప్పడం, వాటిలో ఒక దానిలో మంటలు చెలరేగడం వల్ల దాదాపు 25 మంది మరణించారు. 43 మంది గాయపడ్డారు.
2014 : మే 26న ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్ ప్రాంతంలో గోరఖ్‌పూర్ వైపు వెళుతున్న గోరఖ్‌ధామ్ ఎక్స్‌ప్రెస్, ఖలీలాబాద్ స్టేషన్‌కు సమీపంలో ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఫలితంగా 25 మంది మరణించారు. 50 మందికి పైగా గాయపడ్డారు.
2016 : నవంబర్ 20న ఇండోర్-పాట్నా ఎక్స్‌ప్రెస్ 19321 భారతదేశంలోని కాన్పూర్‌లో పుఖ్రాయాన్‌కు సమీపంలో పట్టాలు తప్పడంతో కనీసం 150 మంది ప్రయాణికులు మరణించారు. 150 మందికి పైగా గాయపడ్డారు.
2017 : ఆగస్టు 23న ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్యా సమీపంలో ఢిల్లీకి వెళ్లే కైఫియత్ ఎక్స్‌ప్రెస్‌లోని తొమ్మిది రైలు కోచ్‌లు పట్టాలు తప్పడంతో కనీసం 70 మంది గాయపడ్డారు.
అదే ఏడాది ఆగస్ట్ 18న, పూరీ-హరిద్వార్ ఉత్కల్ ఎక్స్‌ప్రెస్ ముజఫర్‌నగర్‌లో పట్టాలు తప్పడంతో 23 మంది మరణించారు. దాదాపు 60 మంది గాయపడ్డారు.
2022 : జనవరి 13న, పశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్‌దువార్‌లో బికనీర్-గౌహతి ఎక్స్‌ప్రెస్ యొక్క కనీసం 12 కోచ్‌లు పట్టాలు తప్పడంతో 9 మంది మరణించారు. 36 మంది గాయపడ్డారు.
2023 : జూన్ 2న ఒడిశాలో బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలుతో కూడిన భయంకరమైన ట్రిపుల్ రైలు ప్రమాదంలో కనీసం 238 మంది మరణించారు. 900 మందికి పైగా గాయపడ్డారు.