ఆందోళనలను విరమించిన రైతు సంఘాల నేతలు

Leaders of farmers' unions who stopped the agitation in Delhi. కేంద్రం తీసుకొచ్చిన నూత‌న సాగు చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ చేస్తున్న ఆందోళ‌న‌ల‌ను తాత్కాలికంగా విర‌మిస్తున్న‌ట్లు రైతు సంఘాల నేత‌లు ప్ర‌క‌టించారు.

By అంజి  Published on  9 Dec 2021 1:34 PM GMT
ఆందోళనలను విరమించిన రైతు సంఘాల నేతలు

కేంద్రం తీసుకొచ్చిన నూత‌న సాగు చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ చేస్తున్న ఆందోళ‌న‌ల‌ను తాత్కాలికంగా విర‌మిస్తున్న‌ట్లు రైతు సంఘాల నేత‌లు ప్ర‌క‌టించారు. ఇది పూర్తి విర‌మ‌ణ కాద‌ని, తాత్కాలికంగానే విర‌మించిన‌ట్లు సంయుక్త కిసాన్ మోర్చా నేత గురునామ్ సింగ్ చౌరానీ అన్నారు. జ‌న‌వ‌రి 15న మ‌రోసారి స‌మావేశమ‌వుతామ‌ని.. ప్ర‌స్తుతానికి ప్ర‌భుత్వం త‌మ‌కు కొన్ని హామీల‌ను ఇచ్చింద‌ని, అందుకే త‌మ ఉద్య‌మానికి తాత్కాలికంగా విరామం ప్ర‌క‌టించామ‌ని అన్నారు. ప్ర‌భుత్వం ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌ని ప‌క్షంలో మ‌రోసారి ఉద్య‌మాన్ని చేస్తామని ఆయ‌న తేల్చి చెప్పారు.

ప్ర‌స్తుతానికైతే ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లోని సింఘూ బార్డ‌ర్‌లోని టెంట్ల‌ను తొల‌గిస్తున్నామ‌ని, త‌మ త‌మ స్వ‌స్థ‌లాల‌కు వెళ్ల‌డానికి సన్న‌ద్ధ‌మ‌వుతున్నామ‌ని రైతులు పేర్కొంటున్నారు. సింఘూ స‌రిహ‌ద్దు ప్రాంతాల‌ను తాము శుక్ర‌వారం సాయంత్రం నుంచి ఖాళీ చేయ‌డం ప్రారంభిస్తామ‌ని తెలిపారు. 13 న స్వ‌ర్ణ దేవాల‌యానికి వెళ్తామ‌ని, 15 క‌ల్లా పంజాబ్‌లోని రైతులు త‌మ ఉద్య‌మానికి తాత్కాలికంగా స్వ‌స్తి ప‌లుకుతార‌ని రైతు అశోక్ ధావ‌లే పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటామని ప్రభుత్వం తెలిపింది. ఢిల్లీ మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాలలో దహనం ఫిర్యాదుల వరకు క్షమాభిక్ష ఇవ్వనున్నారు. 40కి పైగా రైతు సంఘాల సమ్మేళనం అయిన సంయుక్త కిసాన్ మోర్చాతో చర్చించిన తర్వాత ప్రభుత్వం పార్లమెంటులో విద్యుత్ సవరణ బిల్లును కూడా తీసుకురానుంది.

Next Story